Share News

Viral: గర్ల్‌ఫ్రెండ్ లేనేలేదు.. ఎప్పుడూ ఒంటరితనమే.. యువతకు కనెక్ట్ అయిన ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్!

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:59 PM

ఇంటికి దూరంగా హాస్టళ్లల్లో ఉంటూ ఒంటరితనంతో బాధపడే విద్యార్థులు ఎలా తట్టుకుని నిలబడాలో చెబుతూ ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షూ త్యాగీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Viral: గర్ల్‌ఫ్రెండ్ లేనేలేదు.. ఎప్పుడూ ఒంటరితనమే.. యువతకు కనెక్ట్ అయిన ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: మనిషి సంఘజీవి. తోడు లేకుండా బతకలేడు. కానీ జీవితంలో అనేక దశల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చదువుకునే రోజుల్లో హాస్టల్ జీవితాలు, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వెరసి యువతను ఒంటరివాళ్లను చేస్తాయి. ఇది చివరకు అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. విద్యార్థులు పరీక్ష సమయాల్లో ఒంటరితనం కారణంగా ఒత్తిడికి లోనై ఎగ్జామ్స్‌కు సరిగ్గా సన్నద్ధమవ్వలేరు. అయితే, తోడు కోరుకోవడం ఎంత సహజమో ఒంటరితనం కూడా అంతే సహజం అని ఐఎఫ్ఎస్ అధికారి హిమాంన్షూ త్యాగీ తెలిపారు. ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతూ ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral) మారింది. తన జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ ఆయన యువతకు పలు సూచనలు చేశారు.

Viral: దేశం ఎప్పటికీ ఇంతే.. వీళ్లింక మారరు! ఇదిగో ప్రూఫ్!


‘‘ఏడాది పాటు జేఈఈ ప్రిపరేషన్, ఆ తరువాత నాలుగేళ్లపాటు ఐఐటీ చదువులు. అనంతరం మరో ఆరేళ్ల పాటు వివిధ ఉద్యోగాలు.. ఈ కాలమంతా నేను ఇంటికి దూరంగానే ఉన్నా. నాకు ఫ్రెండ్స్ తక్కువే. గర్ల్‌ఫ్రెండ్ అసలు లేనేలేదు. అంతా ఒంటరితనమే. దీన్ని నేను చాలా దగ్గర నుంచి చూశా. కానీ ఈ ఒంటరితనంలోనే ఎదిగా. కాబట్టి ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తోందని మీకు అనిపిస్తే ఇది చదవండి’’

‘‘మనుషుల మధ్య ఉంటే సంతోషంగా ఉంటుంది. వారు దూరమైతే గుండె పగులుతుంది. మానవ సంబంధాలు మానసిక ఆరోగ్యానికి కీలకమే. కానీ, మనచుట్టూ ప్రతిసారీ నమ్మదగిన వారు ఉంటారన్న గ్యారెంటీ లేదు. కాబట్టి, ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఎలా జీవించాలో తెలుసుకోవాలి. మీకు మీరే స్నేహితుడిగా ఉండాలి. నిజమైన సంబంధాలు కొన్ని ఉన్నా చాలు. మనసులో ఉన్నది దాపరికాలు లేకుండా పంచుకునే బంధాలు ఏర్పడేందుకు కొంత టైం పడుతుంది. మీ పేరెంట్స్ లేదా తోడబుట్టిన వాళ్లకు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ మనసులోని భావాలకు అక్షరరూపం ఇవ్వండి. ఆలోచన ఏదైనా ఓ పుస్తకంలో రాసుకోండి. ఇదీ మీకు ఉపశమనంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పోస్టు యువతకు బాగా కనెక్ట్ కావడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 10:00 PM