Viral Video: షాకింగ్.. టేకాఫ్ సమయంలో ఊడిన విమానం చక్రం.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:22 PM
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో దాని చక్రం ఊడిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో దాని చక్రం (Flight Wheel) ఊడిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా (America)లోని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జపాన్‌కు (Japan) వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ అసెంబ్లీలో ఉండే ఆరు టైర్లలో ఒకటి ఉన్నట్టుండి ఊడిపోయింది.
బోయింగ్ 777 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైరు ఊడిన విషయాన్ని గమనించిన పైలెట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఎంజెలెస్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందులో ఉన్న 235 మంది ప్రయాణికులను వేరే విమానంలో గమ్య స్థానాలకు పంపించారు. కాగా, శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఉడిపోయిన విమానం టైరు పార్కింగ్ చేసి ఉన్న ఓ కారుపై పడింది. దీంతో ఆ కారు తీవ్రంగా ధ్వంసమైంది. కాగా, ఈ ఘటనపై ఏవియేషన్ అధికారులు దర్యాఫ్తునకు ఆదేశించారు.