Share News

Viral: మెట్రోలో మహిళల గొడవ.. జుట్టు పట్టుకుని పరస్పరం దాడి.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:18 PM

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు డబ్ల్యూడబ్ల్యూఈని తలపించే రీతిలో కలబడి కొట్టుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో బాగా ఎంటర్‌టైన్ చేస్తోందంటూ జనాలు కామెంట్‌లు గుప్పిస్తున్నారు.

Viral: మెట్రోలో మహిళల గొడవ.. జుట్టు పట్టుకుని పరస్పరం దాడి.. షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రో పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది రీల్స్, షార్ట్ వీడియోల రికార్డింగులు, ప్రయాణికుల మధ్య తగాదాలు. ముఖ్యంగా, ప్రయాణికుల ఘర్షణలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ (Viral) అవుతూనే ఉంటాయి. వెంటికవే కొత్తగా ఉంటూ నెటిజన్లకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటాయి. ఇలాంటి మరో వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.

Viral: గుడ్లను తింటున్న పాము! ఏం చేయలేక నిస్సహాయంగా బాతులు! ఇంతలో సడెన్‌గా..


డబ్ల్యూూడబ్ల్యూఈని తలపించేలా ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఈ ఫైట్ జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. గొడవ ఎందుకు మొదలైందో తెలీదు కానీ తొలుత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ ఒకరినొకరు తెగ తిట్టిపోస్తున్నారు. చుట్టుపక్కల వారు వారిని రికార్డు చేస్తున్నా పట్టించుకోకుండా గొడవ పడ్డారు. ఆ తరువాత ఇద్దరూ కాస్త శాంతించినట్టు కనిపించారు. ఒకరినొకరు విమర్హించుకుంటూనే బోగీ తలుపు వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే మళ్లీ తీవ్ర ఆగ్రహానికి లోనైన ఇద్దరూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. జట్టు పట్టుకుని ఒకరిపై మరొకరు చేయి చేసుకునే దాకా వెళ్లారు. ఇదంతా చూసిన తోటి ప్రయాణికులు దిమ్మెర పోయారు. విషయం ఎక్కడి వరకూ వెళుతుందో తెలీక ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే, వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు (Delhi Metro Turns Into WWE Ring As Women Slap, Punch Each Other ).


ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ఢిల్లీ ఎప్పటికీ మారదంటూ విమర్శలు గుప్పించారు. కనీస మర్యాదలు లేనివారితో ఢిల్లీ నిండిపోయిందని అన్నారు. మెట్రోల్లో కూడా ఏసీ ఆఫ్ చేస్తే జనాల మధ్య గొడవలు తగ్గిపోతాయని కొందరు అన్నారు. సుఖమయమైన రైలు ప్రయాణాన్ని ఆస్వాదించకుండా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా తగవుకు దిగడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోల్లో ఇలాంటి ఘటన ఎక్కువైపోయాయని, ప్రయాణికులు సంయమనంతో మసలు కోవడం తెలుసుకోవాలని కొందరు సూచించారు. ఇలా రకరకాల కామెంట్‌ల మధ్య ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 09:18 PM