Share News

NEET: అలా అయితే.. మేనేజ్‌మెంట్ కోటాలో చదివిన డాక్టరే కావాలని అడగండి: అన్‌అకాడమీ సీఈఓ

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:39 PM

పోటీ పరీక్షల ఆవశ్యకతపై అన్‌అకాడమీ సీఈఓ, ఓ ముంబై డాక్టర్ మధ్య సంవాదం నెట్టింట వైరల్‌గా మారింది.

NEET: అలా అయితే.. మేనేజ్‌మెంట్ కోటాలో చదివిన డాక్టరే కావాలని అడగండి: అన్‌అకాడమీ సీఈఓ

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న పోటీ పరీక్షల ఆవశ్యకతపై (Significance of Competitive Exams) కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. కొందరు ఈ పరీక్షలను వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తారు. మరోవైపు, ఈ పోటీ పరీక్షలకున్న డిమాండ్ దృష్ట్యా భారీ వ్యాపారావకాశాలు పుట్టుకొచ్చాయి. కోచింగ్ సెంటర్లు అనేక చోట్ల వెలిసాయి. టెక్నాలజీ పుణ్యమా అని దేశంలో ఎడ్‌టెక్ యుగం (EdTech companies) కూడా మొదలైంది. బైజూస్ (Byju's), అన్‌అకాడమీ (Unacademy) వంటి సంస్థలన్నీ ఈ ట్రెండ్‌లో భాగమే. ఈ నేపథ్యంలో నీట్, జేఈఈ (NEET, JEE) వంటి పరీక్షలు అనవసరమంటూ ఓ డాక్టర్ చేసిన ట్వీట్‌కు అన్‌అకాడమీ సీఈఓ (Unacademy CEO) గౌరవ్ ముంజాల్ ఘాటుగా స్పందించారు. ఆయన సమాధానం ప్రస్తుతం తెగ వైరల్ (Viral News) అవుతోంది.

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..


ముంబైకి చెందిన డాక్టర్ అనిరుద్ధా మాల్పానీ నీట్, జేఈఈ వంటి ఎగ్జామ్స్ నిరర్థకమంటూ ట్వీట్ చేశారు. ఈ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న అన్‌అకాడమీ సీఈఓకు ఇవి వ్యర్థమన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. దీనికి గౌరవ్ ముంజాల్ ఘాటుగా స్పందించారు. ‘‘అలా అయితే, మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మేనేజ్‌మెంట్ కోటాలో చదువుకున్న డాక్టరే కావాలని అడగండి. నీట్ పాసైన డాక్టర్ వద్దని చెప్పండి. ఈ పోటీ పరీక్షలన్నీ మేధో ఆధారితమైనవి. భారత్ నెలకొల్పిన అత్యత్తమ వ్యవస్థల్లో ఇవీ ఒకటి. ఈ ఎగ్జామ్‌లల్లో పాసై తమ జీవితాల్ని మలుపు తిప్పుకున్న ఎందరో వ్యక్తులు నాకు తెలుసు. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో దాదాపు 50 శాతం అడ్మిషన్లు మేనేజ్‌మెంట్ కోటా లేదా లెగసీ అడ్మిషన్లే. అనేక రకాలుగా పతనం అంచున్న ఉన్న వ్యవస్థల్లో ఎంతో కొంత పారదర్శకత ఉందంటే అది ఈ పోటీ పరీక్షలే వల్లే’’ అని చెప్పుకొచ్చారు.

థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..


ఈ సంవాదంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు పోటీ పరీక్షలను సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. తాను యూట్యూబ్ వీడియోలు చూసి ఐఐటీలో సీటు సాధించానని, అలాంటప్పుడు, ఐఐటీ జేఈఈని ఎలా నిందించగలమని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఎడ్ టెక్ కంపెనీలు ఎవరినీ బలవంతం చేయట్లేదని, నచ్చిన వాళ్లు డబ్బులు చెల్లించి వారి సేవలు వినియోగించుకుంటున్నారని కొందరు చెప్పుకొచ్చారు. భారీ జనాభా ఉన్న భారత్ వంటి దేశాల్లో పోటీ పరీక్షలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి కలగజేస్తాయని కొందరు చెప్పుకొచ్చారు. కాబట్టి, ఇక్కడి పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయాలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

StealToilet: బాయ్‌ఫ్రెండ్‌తో యువతి బ్రేకప్.. మరుసటి రోజు బాత్రూమ్‌లోకి వెళ్లి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 06:48 PM