Share News

Dairy: ఏదో వెతుకుతూంటే మనవరాలి కంట పడిన అమ్మమ్మ డైరీ.. అందులో రహస్యంగా రాసుకున్న విషయాలేంటో తెలిస్తే..

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:32 PM

అమ్మమ్మ రహస్యంగా రాసుకున్న విషయాలు చదివిన మనవరాలి రియాక్షన్ ఇదీ..

Dairy: ఏదో వెతుకుతూంటే మనవరాలి కంట పడిన అమ్మమ్మ డైరీ.. అందులో రహస్యంగా రాసుకున్న విషయాలేంటో తెలిస్తే..

డైరీ అంటేనే బోలెడు జ్ఞాపకాల భాండాగారం. ప్రతిరోజూ జరిగే ప్రత్యేక విషయాలను డైరీగా రాసుకోవడం చాలామంది అలవాటు. డైరీ రాయడం వల్ల క్రమ శిక్షణ అలవడుతుందని, తమ జీవితంలో తప్పొప్పులు తెలుస్తాయని, ఆత్మవిమర్శకు డైరీ రాయడం మంచి మార్గమని అంటుంటారు. ఈ లాభాల సంగతి ప్రక్కన పెడితే కొందరు డైరీలో తమకు ఇష్టమైన వారి గురుంచి, జరిగిన అపురూప సంఘటలన గురించి ఎంతో ప్రేమగా రాసుకుంటారు. అలా ఓ అమ్మమ్మగారు రాసుకున్న డైరీ తన మనవరాలి కంట పడింది. అది చూసిన మనవరాలు చాలా భావోద్వేగంలోకి జారిపోయిందియ. మా అమ్మమ్మ తన డైరీలో రాసుకున్న విషయాలు ఇవీ.. అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

నటాలీ కార్లో మాగ్నో అనే విదేశీ యువతి ఇంట్లో ఏదో వెతుకుతూ ఉంటే ఆమెకు ఒక డైరీ దొరికింది. తన అమ్మమ్మ డైరీలో ఏం రాసుకుందా అనే కుతూహలంతో డైరీ తెరచి చూసి షాకైంది. డైరీలో అమ్మమ్మ తన మనవరాలి గురించి బోలెడు విషయాలు రాసుకుంది. నటాలీ కడుపులో ఉందని తెలిసినప్పటి నుండి అమ్మమ్మ ఆలోచనలు పూర్తీగా నటాలీ చుట్టూనే ఉన్నాయి. నటాలీకి 6వారాలు నిండినప్పటి నుండి ప్రతి విషయం డైరీలో రాసుకుంది. ఇక నటాలీ పుట్టిన తరువాత మొదటిసారి అడుగులు వేయగా చూసింది అమ్మమ్మే.. కానీ ఆ విషయం అమ్మమ్మ తన కూతురు, అల్లుడితో చెప్పలేదు. ఆ విషయాన్ని వాళ్లే మొదట చూసి సంతోషపడాలని వాళ్ల దగ్గర దాచిపెట్టింది. ఆ తరువాత ఆ తరువాత కూతురు అల్లుడు వచ్చి నటాలీ మొదటగా అడుగులు వేస్తోందని చెప్పి సంతోషపడ్డారు. ఈ విషయాలన్నీ అమ్మమ్మ తన డైరీలో చాలా అపురూపంగా రాసుకుంది. అంతేనా.. 'నటాలీ.. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందరూ నిన్ను ప్రేమిస్తారు' అని వెలకట్టలేని ప్రేమను తన మనవరాలి మీద చూపిస్తూ డైరీలో రాసుకుంది. నేను పుట్టిన తరువాత మా అమ్మమ్మ ప్రపంచమంతా నేనే ఉండిపోయాను అంటూ డైరీలో కొన్ని పేజీలను నటాలీ సోషల్ మీడియోలో చాలా ఎమోషన్ గా పంచుకుంది.

ఇది కూడా చదవండి: రోజూ వేరుశనగలు తింటే.. వెయ్యి ఏనుగుల బలం!


నటాలీ పంచుకున్న విషయాలను చూసిన నెటిజన్లు కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 'ఈ డైరీ రూపంలో అమ్మమ్మ ఎప్పటికీ జీవించి ఉంటుంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'అమ్మమ్మ నటాలీ గురించి డైరీ రాయడం ఎంత గొప్ప జ్ఞాపకమో.. ఇది చూసి నేను కూడా నా పిల్లల కోసం డైరీ రాయడం మొదలుపెట్టాను' అంటూ ఓ మహిళ స్పందించింది. 'అమ్మమ్మ ప్రేమ గురించి తెలిసే కొద్దీ నాకు కన్నీరు ఆగలేదు'అంటూ మరొకరు స్పందించారు.

ఇది కూడా చదవండి: Masala Tea: మసాలా టీ ఆరోగ్యానికి మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..!


మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 28 , 2024 | 12:49 PM