Share News

Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - May 31 , 2024 | 10:26 AM

ప్రస్తుతం వివాహం చేసుకునే యువతీ యువకులు ప్రీ-వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌ను విపరీతంగా ఫాలో అవుతున్నారు. పెళ్లికి ముందే వధువు, వరుడు కలిసి రకరకాలుగా ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ క్రేజ్ హద్దులు దాటుతోంది.

Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Bride stunt on the road

ప్రస్తుతం వివాహం (Marriage) చేసుకునే యువతీ యువకులు ప్రీ-వెడ్డింగ్ షూట్ (pre wedding shoot ) ట్రెండ్‌ను విపరీతంగా ఫాలో అవుతున్నారు. పెళ్లికి ముందే వధువు, వరుడు కలిసి రకరకాలుగా ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ క్రేజ్ హద్దులు దాటుతోంది. కొత్తగా ఉండాలనే ఆత్రుతతో చాలా మంది పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వధువు (Bride) తిప్పలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే (Viral Video).


vikramgurjar అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి నడి రోడ్డుపై స్టంట్లు చేస్తోంది. బరువైన నగలు, లెహంగా ధరించిన వధువు వెనక్కి వంగి చేతుల మీదుగా నడుస్తోంది (Bride stunt on the road). ఫొటోగ్రాఫర్లు వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.


ఈ వీడియోను 15 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హారర్ సినిమాల్లో కొన్ని దెయ్యాలు ఇలాగే నడుస్తాయి``, ``పెళ్లి పీటల మీద కూర్చుకోవాల్సిన అమ్మాయికి ఇదేం దౌర్భాగ్యం``, ``పెళ్లయ్యాక ఈమె అత్తమామలు చాలా బాధలు పడతారు``, ``ఆమెకు కాబోయే భర్త రియాక్షన్ ఏంటో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లు ఎంతో షార్ప్ అయితే తప్ప.. ఈ ఫొటోలోని ``W`` ని కనిపెట్టలేరు.. ఓ సారి ప్రయత్నించండి!


Viral: బ్రిటీష్ కాలం నాటి రూ.10 నోటు చూశారా? దానిని ఇప్పుడు దక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 10:26 AM