Share News

Viral: బ్రిటీష్ కాలం నాటి రూ.10 నోటు చూశారా? దానిని ఇప్పుడు దక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..

ABN , Publish Date - May 31 , 2024 | 10:08 AM

మన దేశానికి చెందిన రెండు రూ.10 రూపాయలు నోట్లను లండన్‌లో వేయబోతున్నారు. లండన్‌లోని నూనన్స్ మేఫెయిర్ వేలం కేంద్రంలో వేలం వేయనున్నారు. వీటి వేలం ధరను ఎంతగా నిర్ణయించారో తెలుసా? 2,000 నుండి 2,600 పౌండ్లు. అంటే అక్షరాలా 2.7 లక్షల రూపాయలు.

Viral: బ్రిటీష్ కాలం నాటి రూ.10 నోటు చూశారా? దానిని ఇప్పుడు దక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాలంటే..
10 rupee note

మన దేశానికి చెందిన రెండు రూ.10 రూపాయలు నోట్లను (10 rupee notes) లండన్‌లో (London) వేయబోతున్నారు. లండన్‌లోని నూనన్స్ మేఫెయిర్ వేలం కేంద్రంలో వేలం (Auction) వేయనున్నారు. వీటి వేలం ధరను ఎంతగా నిర్ణయించారో తెలుసా? 2,000 నుండి 2,600 పౌండ్లు. అంటే అక్షరాలా 2.7 లక్షల రూపాయలు. అంత ఖరీదు ఎందుకంటే.. ఆ నోట్లు రెండూ 105 సంవత్సరాల క్రితం నాటివి. అంటే బ్రిటీష్ కాలానికి చెందినవి. ఈ రెండు నోట్లూ 1918లో ప్రింట్ అయ్యాయి. అందుకే వాటికి ఇప్పుడు వేలం నిర్వహిస్తున్నారు (Viral News).


జూలై 2, 1918 న జర్మన్ U-బోట్ ముంబై నుంచి లండన్‌కు పయనమైంది. అయితే ఓడ లండన్‌‌కు సమీపంలో మునిగిపోయింది. ఆ ఓడ శిథిలాల మధ్య దొరికిన చాలా రూ.5, రూ.10 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాల్చేసి తిరిగి అచ్చు వేశారు. అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చిన కొన్ని నోట్లను స్థానిక ప్రజలు భద్రపరుచుకున్నారు. వాటిల్లో రెండు నోట్లు తాజాగా బయటపడడంతో నూనన్స్ మేఫెయిర్ వేలం కేంద్రం వేలం వేయడానికి ముందుకు వచ్చింది.


దాదాపు 105 ఏళ్ల క్రితం నాటి ఆ నోట్లను వేలం వేస్తే మంచి ధర వస్తుందని వేలం హౌస్ ఛీఫ్ థామస్సినా స్మిత్ భావిస్తున్నారు. ఆ రెండు నోట్ల ఖరీదును 2.7 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. మరి, ఈ పురాతన రూ.10 నోట్లను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లు ఎంతో షార్ప్ అయితే తప్ప.. ఈ ఫొటోలోని ``W`` ని కనిపెట్టలేరు.. ఓ సారి ప్రయత్నించండి!


Viral Video: ఇది కచ్చితంగా బెస్ట్ వీడియో.. బట్టల షాప్‌ తలుపు తీసుకుని లోపలికి వెళ్లిన ఆవు ఏం చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 10:09 AM