Watch Video: బాబోయ్.. నిప్పుతో చెలగాటం అంటే ఇదే.. కత్తెరతో కాదు మంటతో హెయిర్ కటింగ్!
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:05 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో బార్బర్ హెయిర్ కటింగ్ చేసిన విధానం చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ బార్బర్ కత్తెరతో కాకుండా మంటలతో ఓ కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేశాడు.
వెరైటీ పేరుతో ఏదో ఒక కొత్త ప్రయోగం చేయడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఫ్యాషన్, స్టైల్ పేరుతో ప్రమాదాలతో ఆడుకోవడం అలవాటుగా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో బార్బర్ (Barber) హెయిర్ కటింగ్ (Hair Cutting) చేసిన విధానం చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ బార్బర్ కత్తెరతో కాకుండా మంటలతో ఓ కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేశాడు (Hair Cutting with Flames). ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది.
non aesthetic things అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కస్టమర్‌కు బార్బర్ హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. అయితే కటింగ్ కోసం కత్తెర కాకుండా మంటను ఉపయోగించాడు. దువ్వెనతో కస్టమర్ జుట్టును పట్టుకుని చాలా నైపుణ్యం ఉపయోగించి కాల్చేశాడు. కస్టమర్ తల చుట్టూ మంటలు రావడం ఆందోళనకరంగా అనిపించవచ్చుగానీ, కస్టమర్ జుట్టును నిప్పుతో స్టైలింగ్ చేయడంలో నైపుణ్యం ప్రదర్శించిన బార్బర్‌ను మాత్రం అభినందించాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆ బార్బర్ ట్యాలెంట్‌ను ప్రశంసించగా.. మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ``జుట్టును మంటలతో కాల్చితే వాసన రాదా``, ``ఇంత ప్రమాదకరంగా కటింగ్ చేయించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం``, ``ఆ కస్టమర్ ధైర్యానికి హ్యాట్సాఫ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.