Share News

Viral: తల తెగి పడుతుందంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. కదులుతున్న రైలు టాపు ఎక్కిన కుర్రాడు ఏం చేశాడో చూస్తే..

ABN , Publish Date - Mar 15 , 2024 | 05:05 PM

రీల్స్‌తో పాప్యులర్ అవ్వాలనే ప్రయత్నంలో ఓ యువకుడు చేసిన దారుణ ప్రయత్నం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Viral: తల తెగి పడుతుందంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు.. కదులుతున్న రైలు టాపు ఎక్కిన కుర్రాడు ఏం చేశాడో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రీల్స్, షార్ట్ వీడియోలతో పాప్యులర్ అయిపోవాలని భావిస్తున్న యువత రిస్కీ పనులు చేసేందుకూ వెనకాడట్లేదు. ఇలాంటి ఓ తింగరి ప్రయత్నం తాలూకు వీడియో నెట్టింట చెక్కర్లు (Viral) కొడుతోంది. వీడియోలోని ఓ యువకుడు తాను చూసిన వీడియో గేమ్‌లోని ఫీట్లను నిజజీవితంలో ట్రై చేశాడు. ఇదంతా చూసిన జనాలు అతడిని తిట్టిపోస్తున్నారు. తల తెగి పడుతుందంటూ గడ్డిపెడుతున్నారు.

Viral: అపరిచితుడితో ప్రేమ.. 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అతడిని కలుసుకునేందుకు కోటి ఆశలతో వెళితే..


సబ్‌వే సర్‌ఫర్ మొబైల్ గేమ్ గురించి అందరికీ తెలిసింది. ఆ గేమ్‌లో చేసే సాహసకృత్యాలను నిజజీవితంలో ప్రయత్నించాడా యువకుడు. రైలు వంతెన మీంచి వెళుతుండగా దాని పైకెక్కాడు. ఆ తరువాత వంతెనపై ఉన్న రాడ్లను తప్పించుకునేందుకు రైలు టాపుపైను కూర్చుంటూ లేస్తూ ఓ వీడియో రికార్డు చేశాడు (Subway Surfers stunt on moving train ).

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


ఈ వీడియోను రికార్డు చేసి అతడు నెట్టింట్లో పెడితే జనాల నుంచి అతడు అస్సలు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కుర్రాడి మూర్ఖత్వం చూసి జనాలు షాకైపోయారు. ఇలా చేస్తే త్వరలోనే తల తెగిపడుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రదర్..ఇలాగే చేస్తే త్వరలో నీ గేమ్ ఓవర్ అని మరొకరు హెచ్చరించారు. నమ్మశక్యంగా లేని ఈ షాకింగ్ వీడియోను మీరూ చూడండి.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

Updated Date - Mar 15 , 2024 | 06:00 PM