Share News

Anand Mahindra: నా రోల్ మోడల్ ఈ చిన్నారే.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 18 , 2024 | 09:38 PM

మసాజ్‌ను ఎంజాయ్ చేస్తున్న చిన్నారి వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆదివారాలు ఇలా ఆస్వాదించాలంటూ కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Anand Mahindra: నా రోల్ మోడల్ ఈ చిన్నారే.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: సోమవారం మొదలు శనివారం వరకూ సామాన్యుల నుంచి అపరకుబేరుల వరకూ ప్రతి ఒక్కరూ జీవనపోరాటంలో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హడావుడి జీవితానికి కాస్త విరామమిచ్చి సేద తీరే అవకాశం అపరకుబేరులకూ దుర్లభంగా మారిపోతున్న కాలం ఇది. ఇక సామ్యానుల పరిస్థితి మరింత దయనీయం. అయితే, లైఫ్‌‌ను ఎలా చేయాలో జనాల కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఓ చిన్నారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్వయంగా ఈ వీడియోను (Viral) షేర్ చేశారు.


వీడియోలోని బుడ్డుడో నెత్తికి చేస్తున్న మసాజ్‌ను తెగ ఎంజాయ్ చేశాడు. మసాజ్‌లో పూర్తిగా లీనమైపోయి ప్రతిక్షణాన్ని ఆస్వాదించాడు. లోకంలో ఇంతకు మించిన ఆనందం లేదన్నట్టు చిన్నారి ముఖకవళికలు ఉన్నాయి. నెత్తిమీద సుతిమెత్తగా ఎవరో రాస్తుండగా బుజ్జాయి హాయిగా సేద తీరాడు (Anand Mahindra shares video of baby enjoying forehead massage).

ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తనకు చిన్నారే రోల్ మోడల్ అని కామెంట్ చేశారు. ఆదివారాలు ఎలా ఎంజాయ్ చేయాలో ఈ పసివాడిని చూస్తే అవగతమవుతుందనే అర్థంలో ఆయన ఈ కామెంట్ చేశారు.


వీడియోలోని చిన్నారి హావభావాలు, అతడు సేదతీరుతున్న తీరు జనాలను కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ బుడతడి లాగా మనందరం ఆదివారం రిలాక్స్ కాగలిగితే సోమవారం మన స్పీడుకు పట్టపగ్గాలు ఉండవని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. చిన్నారిని చూస్తుంటే మనసంతా సానుకూల దృక్పథంతో నిండిపోతోందని అన్నారు. ఇంత మంచి వీడియోను షేర్ చేసినందుకు మరికొందరు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Aug 18 , 2024 | 09:38 PM