Viral: నీలిసంద్రం ఎదురుగా జన సంద్రం! టీమిండియా పరేడ్ చూసి ఆనంద్ మహీంద్రా షాక్
ABN , Publish Date - Jul 05 , 2024 | 06:46 PM
టీమిండియా పరేడ్ లో పాల్గొని జగజ్జేతలను ప్రత్యేక్షంగా చూసేందుకు జనాలు పోటెత్తిన తీరును చూసి ఏకంగా ఆనంద్ మహీంద్రానే షాకైపోయారు. ఇకపై మెరైన్ డ్రైవ్‌ను జాదూ కీ ఝప్పీ అని పిలవాలని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆనంద్ మహీంద్రా క్రికెట్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఎంతగా అంటే.. టోర్నీల ఫైనల్ మ్యాచులను తను చూస్తే భారత్ ఓడిపోతుందనే భయంతో వాటికి దూరంగా ఉన్నాని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు. అయితే, ఆనంద్ మహీంద్రాతో పాటు అశేష అభిమానులకు ఉన్న ఇలాంటి భయాలన్నిటినీ తుడిచి పెట్టేస్తూ టీమిండియా టీ20 ప్రపంచకప్ సాధించింది. జగజ్జేతలుగా స్వదేశానికి తరలి వచ్చాక ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో భారీ ఓపెన్ బస పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్ లో పాల్గొని జగజ్జేతలను ప్రత్యేక్షంగా చూసేందుకు జనాలు పోటెత్తిన తీరును చూసి ఏకంగా ఆనంద్ మహీంద్రానే షాకైపోయారు (Viral).
Viral: వేల కోట్ల ఆస్తి ఉన్నా.. 30 ఏళ్లుగా చీరలు కొనని సుధామూర్తి! ఎందుకంటే..
పరేడ్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. మెరీన్ డ్రైవ్ పేరును ఇకపై క్వీన్స్ నెక్లెస్‌గా కాకుండా జాదూ కీ ఝప్పీ అని పిలాలని వ్యాఖ్యానించారు. అక్కడ వెల్లువెత్తిన ప్రజాభిమానానికి సంకేతంగా మున్నాభాయ్ సినిమాలోని ఈ పాప్యులర్ డైలాగ్‌ను ఆయన సూచించారు. ఇది చూసిన క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ కూడా స్పందించారు. అద్భుతంగా ఉంది సర్ అని ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు (Anand Mahindra Gives New Name To Marine Drive After Team Indias Parade).
కాగా, ఓపెన్ బస్ పరేడ్ అనంతరం, టీమిండియా వాంఖెడే స్టేడియంకు చేరుకుంది. అక్కడి బీసీసీఐ టీమిండియా సభ్యులకు రూ.125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేశారు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. 76 పరుగులతో విరాట్ కోహ్లీ, 3 వికెట్లతో హార్దిక్ పాండ్యా, 2 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టోర్నీలో తక్కువ పరుగులిచ్చి 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.