Share News

Funny Video: ట్రాఫిక్ జామ్‌.. కార్ల హార్న్ శబ్దాలు భరించలేని ఓ వ్యక్తి బయటకు వచ్చి ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:34 PM

మీరు ఆఫీస్‌కో, ఏదైనా అర్జెంట్ పని మీద బయటకో వెళుతూ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక టెన్షన్, కోపం రావడం సహజం.

Funny Video: ట్రాఫిక్ జామ్‌.. కార్ల హార్న్ శబ్దాలు భరించలేని ఓ వ్యక్తి బయటకు వచ్చి ఏం చేశాడో చూడండి..

మీరు ఆఫీస్‌కో, ఏదైనా అర్జెంట్ పని మీద బయటకో వెళుతూ ట్రాఫిక్ జామ్‌ (Traffic Jam)లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక టెన్షన్, కోపం రావడం సహజం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక చాలా మంది కార్ హార్న్ మోగిస్తూనే ఉంటారు. ట్రాఫిక్‌లో కార్ హార్న్‌ల (Car Horn) మోతతో చిరాకెత్తిన ఓ వ్యక్తి తన కారు నుంచి దిగి ఏం చేశాడో చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).

bekmuhammad_0fficial అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొన్ని కార్లు ట్రాఫిక్ సిగ్నల్ ముందు ఆగి ఉన్నాయి. ఎంతసేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అందరూ కార్ల హార్న్ మోగిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన కార్ నుంచి బయటకు దిగాడు. ముందు కాస్త ఆగ్రహంగా కనిపించాడు. ఆ తర్వాత కార్ హార్న్‌ల మోతకు అనుగుణంగా డ్యాన్స్ (Dance) వేశాడు. శబ్దాలకు అనుగుణంగా తన చేతులు ఊపుతూ ఫన్నీ డ్యాన్స్ (Funny Dance) చేశాడు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 4.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎలాంటి చెడు పరిస్థితుల్లో అయినా మన ట్యాలెంట్‌ను ప్రదర్శించవచ్చు``, ``ఒక్కసారిగా అందరి మూడ్ మారిపోయి ఉంటుంది``, ``ఆ వ్యక్తి డ్యాన్స్ అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ.. చుట్టూ పురుగులూ, బొద్దింకలు.. అయినా ఆ పానీపూరీలను ఎలా తింటున్నారో..

Viral Video: వీడు భర్త కాదు.. రాక్షసుడు.. చికెన్ కూరలో మసాలా తక్కువైందని భార్యను కిటికీ నుంచి తోసేశాడు!

Updated Date - Apr 01 , 2024 | 04:34 PM