Share News

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ.. చుట్టూ పురుగులూ, బొద్దింకలు.. అయినా ఆ పానీపూరీలను ఎలా తింటున్నారో..

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:43 PM

పానీపూరీ ఆరోగ్యానికి మంచిది కాదని, అమ్మేవారు శుభ్రత పాటించరని సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీ.. చుట్టూ పురుగులూ, బొద్దింకలు.. అయినా ఆ పానీపూరీలను ఎలా తింటున్నారో..

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పానీపూరీని (Pani Puri) అందరూ ఇష్టంగా తింటారు. ఓ మోస్తరు గ్రామాల్లో కూడా పానీపూరీ బళ్లు కనిపిస్తున్నాయి. వాటి ముందు జనాలు కూడా కనిపిస్తుంటారు. అయితే పానీపూరీ ఆరోగ్యానికి మంచిది కాదని, అమ్మేవారు శుభ్రత పాటించరని సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

shilpianish అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పానీపూరీ స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఆ పానీపూరీ స్టాల్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. పానీ పూరీలో వేసే ఆలూ కర్రీని వెస్ట్రన్ కమోడ్ ఆకారంలో ఉన్న పాత్రలో ఉంచారు. ఆ కమోడ్‌పై ఈగలు, బొద్దింకలు, పురుగుల స్టిక్కర్లు అంటించారు. పక్కన బకెట్‌లో పానీ ఉంచి మగ్‌తో సర్వే చేస్తున్నారు. దీన్ని చూసిన చాలా మంది మొదట్లో అసహ్యించుకున్నా, పానీపూరీ రుచికి మాత్రం ఫిదా అవుతున్నారు (funny panipuri video).

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 2.7 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``క్రియేటివిటీ చాలా ఛండాలంగా ఉంది``, ``ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్``, ``అక్కడ తింటున్న వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీడు భర్త కాదు.. రాక్షసుడు.. చికెన్ కూరలో మసాలా తక్కువైందని భార్యను కిటికీ నుంచి తోసేశాడు!

Puzzle: 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు!.. ఈ ఫొటోలోని పాముని 7 సెకెన్లలో కనిపెట్టండి..!



Updated Date - Apr 01 , 2024 | 02:43 PM