Share News

Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:39 PM

56 ఏళ్లుగా కడుపులో మృత పిండంతో ఉన్న మహిళ ఇటీవల ఆపరేషన్ తరువాత ఇన్ఫెక్షన్‌ కారణంగా మృతి చెందింది. బ్రెజీల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!

ఇంటర్నెట్ డెస్క్: గర్భం దాల్చిన ఏ మహిళ అయినా 9 నెలల తరువాత బిడ్డను కంటుంది. కానీ, ఓ మహిళ తనకు తెలీకుండానే ఏకంగా 56 ఏళ్ల పాటు గర్భంతో ఉంది (woman pregant for 56 years). ఇటీవల ఓ రోజు కడుపునొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లగా ఈ విషయం బయటపడింది. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లే షాకైపోయారు. బ్రెజిల్‌‌లో (Brazil) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఈ ఐఐటీ జేఈఈ విద్యార్థి రోజూ చేసేది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నెట్టింట గగ్గోలు!


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ మహళ పేరు డానియేలా వెరా. వయసు 81 ఏళ్లు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆమె కడుపులో పిండం అలాగే ఉండిపోయింది. చాలా ఏళ్లక్రితమే మృతిచెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది. కానీ ఈ విషయాలేవీ మహిళకు తెలీదు. ఇటీవల ఆమె పరాగ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తుండగా కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే వైద్యులను సంప్రదించిన ఆమె కడుపులోని పిండం గురించి తెలిసి షాకైపోయింది. ఆమెకు ఎక్స్‌రే తీసి చూసిన డాక్టర్లు కూడా వ‌ృద్ధురాలి పరిస్థితికి నోరెళ్లబెట్టారు. అయితే, ఆ పిండం మరణించి కొన్నేళ్లు దాటిందని , అది గడ్డకట్టుకుపోయిందని (కాల్సిఫికేషన్) కూడా చెప్పారు.

Viral: పాపం.. మరీ ఇలా ట్రోల్ చేయాలా? ఫారిన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థికి షాకింగ్ అనుభవం!


వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి రీత్యా మార్చి 15న ఆపరేషన్ చేసి మృత పిండాన్ని వెలికితీశారు. ఆ తరువాత మహిళ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇటీవలే మృతి చెందారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic pregnancy) కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు వివరించారు. గర్భసంచీకి ఆవల పిండం రూపుదిద్దుకుంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి సమయంలో పిండం ఎక్కువ కాలం మనలేక మృతిచెందినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 03:39 PM