Share News

AP Election 2024: చంద్రబాబు ప్రకటనతో ‘గోరంట్ల’ హ్యాపీయే కానీ.. ఎలా సాధ్యమనే టెన్షన్ మాత్రం వీడట్లేదే..!?

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:51 PM

Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్‌ తగ్గినట్టు అయింది..

AP Election 2024: చంద్రబాబు ప్రకటనతో ‘గోరంట్ల’ హ్యాపీయే కానీ.. ఎలా సాధ్యమనే టెన్షన్ మాత్రం వీడట్లేదే..!?

టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్‌ తగ్గినట్టు అయింది. టీడీపీ, జనసేన నుంచి వీరికి పూర్తి మద్దతు లభించింది. టీడీపీ అధినేత నారాచంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కలిసి ప్రకటించిన తొలి ఉమ్మడి అభ్యర్థులకు జిల్లాలో రెండు పార్టీల నుంచి స్వాగతం లభించింది. ఇంకా జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో మరొకటి కచ్చితంగా జనసేనకు లభించే అవకాశం ఉంది. మిగతా మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే ఉంటారు.


Gorantla-Vs-Durgesh.jpg

గోరంట్ల, దుర్గేష్‌ ఇద్దరికీ పోటీ చేసే అవకాశం!

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో అభ్యర్థుల కేటాయింపు పెద్ద పీటముడిగా ఉంది. టీడీపీ-జనసేన అధినేత లిద్దరికీ సవాల్‌గా మారింది. ఇక్కడ నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla Butchaiah) తిరిగి పోటీ చేస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా ఓ కారణం ఉంది.గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా, పెద్దాపురం నుంచి నిమ్మకాయల నరాజప్పకు, మండపేట నుం వేగుళ్ల జోగేశ్వరరావుకు తిరిగి టికెట్‌ ఇచ్చారు. రాజ మహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి కుటుంబం కోరిక మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు చోటు కల్పించారు. గోరంట్లకు రూరల్‌ నుంచి సీటు కేటాయిం చాల్సి ఉంది. కానీ ఇక్కడ జనసేన ఇన్‌చార్జి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh) కూడా పట్టుబడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.


Kandula-Durgesh.jpg

వదులుకోలేని పరిస్థితి..

ఇక్కడ త్రిముఖ పోటీలో విజయం సాధింన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 74,166 ఓట్లు తెచ్చుకోగా.. వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుకు 63,762 ఓట్లు, జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు 42,685 ఓట్లు లభించాయి. దుర్గేష్‌ జనసేనలో కీలకనేతగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పార్టీని నడిపించారు. జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ సీటు విషయంలో ఇద్దరు నేతలను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటిస్తామని చంద్రబాబు గోరంట్లకు మాటివ్వగా, రూరల్‌ నుం జనసేన పోటీ చేస్తుందని, దుర్గేష్‌ను వదులుకోలేమని ఇటీవల రాజమహేంద్రవరంలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Chandrababu.png

అదెలా సాధ్యమో..?

అటు బుచ్చయ్య.. ఇటు దుర్గేష్ ఇద్దరూ టికెట్ కోసం పట్టుబట్టడంతో ఈ సీటుకు పీటముడిపడింది. దీంతో తొలిజాబితాలో అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ చంద్రబాబు, పవన్‌ విలేకరుల సమావేశంలో తొలి అభ్య ర్థుల ప్రకటన చేసిన తర్వాత వేదిక కింద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల, దుర్గేష్‌ ఇద్దరికీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పడం గమనార్హం. ఇద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎవరిని ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారనేది అధిష్ఠానం నోటి నుంచే రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గోరంట్ల మాత్రం తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని, రూరల్‌ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కందుల దుర్గేష్‌కు పిలుపు రావడంతో విజయవాడ వెళ్లారు. దుర్గేష్‌కు రూరల్‌ ఇస్తే, గోరంట్లకు ఎక్కడ కేటాయిస్తారో మరి. లేక గోరంట్లకే ఈ సీటు కేటాయిస్తే దుర్గేష్‌కు నిడదవోలు సీటు కేటాయించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సీనియర్‌నేత కుందుల సత్యనారాయణ పోటీ పడుతున్నారు. మొత్తం ఈ వ్యవహారం పెద్ద పీటముడిగా బిగిసింది.

tdp.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 02:54 PM