Share News

BRS: వైరల్ అవుతున్న కేసీఆర్ మీటింగ్ ఫొటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ!

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:29 PM

KCR Meeting Photo Internet By Storm: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (TS Assembly Elections) తర్వాత అడ్రస్ లేని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (BRS Chief KCR) ఇవాళ (ఫిబ్రవరి-6న) తెలంగాణ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. గులాబీ బాస్ బాత్రూమ్‌లో జారిపడటం, తుంటి ఆపరేషన్ జరగడం.. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సుమారు నెలన్నర సమయం పట్టింది..

BRS: వైరల్ అవుతున్న కేసీఆర్ మీటింగ్ ఫొటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (TS Assembly Elections) తర్వాత అడ్రస్ లేని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (BRS Chief KCR) ఇవాళ (ఫిబ్రవరి-6న) తెలంగాణ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. గులాబీ బాస్ బాత్రూమ్‌లో జారిపడటం, తుంటి ఆపరేషన్ జరగడం.. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సుమారు నెలన్నర సమయం పట్టింది. వచ్చీ రాగానే ఇన్నిరోజులు ఏం జరిగింది..? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యనేతలతో సమావేశమై ఆరా తీశారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింత వ్యవహారంపై కృష్ణా పరివాహాక ప్రాంతాల ముఖ్య నేతలతో (ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు) కీలకంగా చర్చించారు. ఇప్పటి వరకూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఇతర నేతలు తనపై.. బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌గానే కౌంటర్లిచ్చేశారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇన్ స్టా ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ.. అంతకుమించి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య రచ్చ జరుగుతోంది.


KCR-Telangana-Bhavan.jpg

ఇంతకీ ఏంటది..?

ఇదిగో ఈ ఫొటోను ఒక్కసారి క్లారిటీగా గమనించండి. టపీమని ఏం సందేహం వస్తుందో చూడండి. కేసీఆర్ సీఎంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఆయనకు కుడి భుజంగా కేటీఆర్, హరీష్ రావులు.. సీనియర్ నేత కేశవరావు, నామా నాగేశ్వరరావులు అటు ఇటుగా కూర్చునేవారు. అంతకుమునుపు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు కూడా అలాగే కూర్చునేవారు. అయితే ఒక్కొక్కరుగా పార్టీలు మారడంతో సీన్ మారిపోయింది.. అదంతా ఇక్కడ అప్రస్తుతం. ఇవాళ సమావేశంలో కుమారుడు కేటీఆర్.. అల్లుడు హరీష్ రావు కేసీఆర్‌కు అటు ఇటు లేరు. హరీష్ రావు.. కేసీఆర్‌కు దూరంగా కూర్చుంటే.. ఈ ఇద్దరికీ ఇంకాస్త దూరంగా కేటీఆర్ కూర్చున్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు అటు ఇటు కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య.. జగదీశ్వర్ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. వీరి తర్వాతనే మిగిలిన వారంతా ఉన్నారు. దీంతో ఇద్దర్నీ (కేటీఆర్, హరీష్) బాస్ ఎందుకు దూరంగా కూర్చోబెట్టారు..? కూర్చోబెట్టడమేనా.. మొత్తానికి దూరంగా పెట్టేశారా..? అని సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ‘ఎవరికి వారే యమునా తీరే’ అనే తీరుగా పరిస్థితి ఉందని నెటిజన్లు, కాంగ్రెస్ శ్రేణులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


KCR-Face.jpg

కేసీఆర్‌కు ఏమైంది..?

మరీ ముఖ్యంగా.. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇంటి బయట ఉన్నోళ్లు అయితే యూట్యూబ్‌లు ఓపెన్ చేసి మరీ చూసేవారు. ఎందుకంటే ఆయన పంచ్‌లు, చమత్కారం.. కౌంటర్లు, విమర్శలు అలా ఉండేవి. కానీ ఎన్నికల ముందు నుంచీ ఇవన్నీ ఒక్కొక్కటిగా కొరవడుతూ వస్తున్నాయి. ఇవాళ సమావేశంలో కారు పార్టీ అధినేతను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. మునుపటి ఠీవి, తేజస్సు, చలాకితనం.. మిస్సయ్యింది. మొత్తమ్మీద కేసీఆర్.. కేసీఆర్‌లా లేరు అన్నది క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. ‘నాడు ఎట్లుండే కేసీఆర్.. నేడు సీఎం సీటు పోయే సరికి ఎట్టయిపాయే’ అని కాంగ్రెస్ కార్యకర్తలు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఫొటో మాది క్యాప్షన్ మీది అంటూ ఇంకొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ మోత మోగుతున్నాయ్. కామెంట్స్‌కు మించి ట్రోలింగ్స్ కూడా నెటిజన్లు చేస్తున్నారు. అయితే వీటన్నింటినీ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. ‘సారొచ్చింది ఇప్పుడే కదా.. ముందుంది అసలు సిసలైన సినిమా.. జర ఆగుండి..’ అని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ ఎవర్నీ దూరం చేసుకోరని.. బాస్ కారు దిగినప్పుడు మొదలుకుని సీటులో కూర్చునే వరకూ కేటీఆర్, హరీష్‌లు పక్కనే ఉన్నారన్న విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఏదైతేనేం ఇవాళ కేసీఆర్ సమావేశం తాలుకూ ఫొటో పెద్ద చర్చకే దారితీసింది.

AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?


Updated Date - Feb 06 , 2024 | 09:29 PM