Share News

AP Politics: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్.. కీలక నేత ఔట్!

ABN , Publish Date - Jan 25 , 2024 | 10:53 PM

AP Congress : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి..

AP Politics: వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్.. కీలక నేత ఔట్!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి. వైఎస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కీలక నేతలుగా ఉన్న వారంతా దాదాపు ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. షర్మిల ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో వారంతా తిరిగి సొంత గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు.. సీనియర్లు, ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారు కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుండటంతో కాంగ్రెస్‌కు ఎనలేని జోష్ వచ్చినట్లయ్యింది.


Dutta-Ramachandra-Rao.jpg

మాటిచ్చిన దుట్టా..!

కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేతలు, సీనియర్లను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్ ‌కుమార్‌లతో భేటీ అయిన షర్మిల.. ఇద్దర్నీ పార్టీలోకి ఆహ్వానించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కూడా. తాజాగా.. కృష్ణా జిల్లా సీనియర్ నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ఆప్తుడు, వైసీపీ కీలక నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో షర్మిల భేటీ అయ్యారు. హనుమాన్ జంక్షన్‌లోని దుట్టా నివాసానికి వెళ్లిన షర్మిల.. తాజా రాజకీయాలపై దుట్టాతో చర్చించారు. పార్టీలో చేరాలని ఆహ్వానించగా.. సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీటింగ్ అనంతరం షర్మిల మాట్లాడుతూ.. దుట్టా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. నాన్నకు దుట్టా అత్యంత సన్నిహితులు.. పార్టీకి, తమకు అండగా నిలబడతా అంటూ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. దుట్టాతో షర్మిల భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ భేటీతో వైసీపీ పెద్దలు కంగుతిన్నారు. ఇప్పటికే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న దుట్టా కచ్చితంగా పార్టీ మారుతారనే నిర్ణయానికి అధిష్టానం వచ్చేసిందట. ఇదే జరిగితే మాత్రం.. గన్నవరంతో పాటు.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీకి ఓ కుదుపేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Sharmila-And-Dutta.jpg

ఇదీ బ్యాగ్రౌండ్..!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YS Rajasekhar Reddy) నమ్మినబంటుగా ఉన్న దుట్టా.. ఆయన మరణాంతరం వైఎస్ జగన్ వెంట నడిచినవారులో ఈయన కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున వంశీ పోటీచేయగా.. వైసీపీ తరఫున రామచంద్రరావు పోటీచేశారు. అయితే.. 9,548 ఓట్ల తేడాతో వంశీ గెలిచారు. అయినప్పటికీ వైసీపీలోనే ఉంటూ క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆఖరికి 2019 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కనప్పటికీ యార్లగడ్డకు అన్ని విధాలుగా మద్దుతుగా నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ పార్టీని వీడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దుట్టా గురించి ఏ రోజూ వైఎస్ జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. యార్లగడ్డ టీడీపీలో చేరినా దుట్టా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున యార్లగడ్డ, వైసీపీ తరఫున వంశీ పోటీ పక్కా అని తేలిపోయింది. అయితే దుట్టా పరిస్థితేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందని.. కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఫైనల్‌గా దుట్టా ఏం చేస్తారో.. ఎటువైపు అడుగులు వేస్తారో వేచి చూడాలి మరి.

Dutta-Ramachandra-Rao-2.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2024 | 10:54 PM