AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

ABN , First Publish Date - 2024-02-09T17:34:37+05:30 IST

AP CM YS Jagan Vs MP Magunta At Parliament: అవును.. మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasula Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది..

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

అవును.. మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasula Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది. హస్తిన పర్యటనలో ఉన్న జగన్‌కు పార్లమెంట్ ఆవరణలో మాగుంట పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు.. అంటీముంటన్నట్లుగానే జగన్ వ్యవహరించారు. సీఎంను చూడగానే.. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిందని ఎంతో మర్యాదపూర్వకంగా నమస్కరించి, చేతులు కలపగా అబ్బే అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఒకింత హర్ట్ అయిన మాగుంట.. కనీసం జగన్ వెంట పార్లమెంట్ లోనికి వెళ్లడానికి సాహసించలేదు. వైఎస్ జగన్ వెంట.. ఎంపీలు విజయసాయిరెడ్డి (YS Vijayasai Reddy), వంగా గీత మరికొందరు ఎంపీలు మాత్రమే వెళ్లారు. జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కుతుండగా ముందుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఎందుకో వెళ్లలేకపోయారు. అయితే ఈ గ్యాప్‌లో.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మాగుంట గురించి విజయసాయితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం.


అవునా ఇంత జరిగిందా..?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘అసలు మాగుంటను ఎవరు రమ్మన్నారు..? అసలు మన పార్టీలో ఉన్నారా..? మనకు అవసరం లేదు అనుకున్నాం కదా..? మళ్లీ ఎందుకు’ ఇవన్నీ అని విజయసాయిరెడ్డితో జగన్ అన్నట్లుగా తెలియవచ్చింది. అదేం లేదన్నా.. ‘మేం ఎవరూ ఆయన్ను పిలవలేదు.. ఆయన ఎందుకొచ్చారో కూడా మాకు తెలియదు..?’ అని జగన్‌కు సాయిరెడ్డి బదులిచ్చినట్లుగా సమాచారం. ఈ మాటలు విన్న జగన్.. ‘ఏంటిది చూస్కోవాలిగా సాయన్నా.. అన్నీ తెలిసిన నీ ఆధ్వర్యంలో ఇలా జరగడమేంటి..?’ అని ఒకింత అసహనం వెలిబుచ్చినట్లుగా సమాచారం. మరి ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ నుంచి.. మరీ ముఖ్యంగా మాగుంట, విజసాయిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.


ఇదీ అసలు కథ..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బూతులు తిట్టాలని.. అలాగే ఒంగోలు ఎంపీ టికెట్ కోసం కోట్లు తీసుకుని రావాలని మాగుంటకు వైఎస్ జగన్ అల్టిమేటం జారీచేశారట. అయితే.. ఈ రెండు పనులూ చేయడానికి మాగుంట సిద్ధంగా లేరట. ఒకట్రెండు రోజులు చూసిన జగన్.. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయనపై కోపం పెంచుకుని అసలు మాగుంట పార్టీకి అవసరం లేదని పక్కనెట్టేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధంలేని వ్యక్తి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వైసీపీ హైకమాండ్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ విషయమై జిల్లా సీనియర్, కీలక నేత.. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాగుంటకు టికెట్‌కు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినప్పటికీ జగన్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన కుమారుడు రాఘువరెడ్డితో కలిసి.. టీడీపీలో చేరాలని సన్నాహాలు చేస్తున్నారు మాగుంట. ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం.. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. పైన చెప్పిన ఈ సీన్ జరిగింది.

ఇదిగో ఈ వీడియోపై క్లిక్ చేయండి.. అసలు సంగతేంటో మీకే తెలుస్తుంది..


TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. సినిమా మొదలైనట్టే..?


AP Elections 2024: వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాక్.. టీడీపీదే అధికారమని తేల్చేసిన ఇండియా టుడే సర్వే


Updated Date - 2024-02-09T17:47:00+05:30 IST