NTR Death Anniversary: ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Jan 19 , 2024 | 10:43 AM
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి కుటుంబసభ్యులు, నారా చంద్రబాబు కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వి చౌదరి, తారకరత్న సతీమణి సహ పలువురు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
1/7
స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అందంగా ముస్తాబైన ఎన్టీఆర్ ఘాట్
2/7
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్‌లో తండ్రి నందమూరి తారకరామావుకు నివాళులర్పిస్తున్న దృశ్యం.
3/7
ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరులు, కుటుంబసభ్యులు.
4/7
స్వర్గీయ నందమూరి తారకరామావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తాతకు ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.
5/7
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా భువనేశ్వరికి మోత్కుపల్లి నరసింహులు నమస్కరించి పలుకరిస్తున్న దృశ్యం.
6/7
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా భువనేశ్వరికి స్వర్గీయ నందమూరి తారకరామారావు క్యాలండర్‌ను అందజేస్తున్న ఓ కార్యకర్త..
7/7
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.
Updated at - Jan 19 , 2024 | 10:43 AM