హోటళ్లు, సూపర్ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు
ABN, Publish Date - May 22 , 2024 | 01:41 PM
హైదరాబాద్: నగంరలోని పలు హోటళ్లు, సూపర్ మార్కెట్లపై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు హోటళ్లో కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేశారు. రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం చాక్లెట్లు లభ్యమయ్యాయి. అలాగే జంబో కింగ్ బర్గర్లో క్వాలిటీ లేని పిజ్జాలు సీజ్ చేశారు. కామత్ హోటల్లో నాణ్యత లేని టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షా గౌస్ హోటల్లో నాసిరకం వంటలతో పాటూ కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించి.. సీజ్ చేశారు.
1/5
నగంరలోని పలు హోటళ్లు, సూపర్ మార్కెట్లపై మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. నాణ్యతలేని ఫుడ్, కిచెన్‌లో అపరిశుభ్రతను గుర్తించిన అధికారులు.
2/5
అపరిశుభ్రత.. కాలం చెల్లిన వస్తువుల తనఖీ..వాటిని సీజ్ చేసిన అధికారులు..
3/5
ఓ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన బిస్కట్లను గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు.. యాజమాన్యంపై సీరియస్..
4/5
సూపర్ మార్కెట్లో నిలవ ఉంచిన వస్తువులను పురిశీలిస్తూ.. శాంపిల్స్ సేకరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.
5/5
ఓ హోటల్లో నాణ్యత, పరిశుభ్రతలేని, బొద్దింకలు తిరుగుతున్న వంట గదిని అధికారులు గుర్తించిన దృశ్యం.
Updated at - May 22 , 2024 | 01:54 PM