సింగపూర్‌లో వైభవంగా వినాయకచవితి వేడుకలు
ABN, Publish Date - Sep 13 , 2024 | 12:23 PM
సింగపూర్‌లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభా మందిరంలో శాస్త్రీయంగా కల్పోక్తరీతిలో భక్తి శ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
1/7
సింగపూర్‌లో వైభవంగా వినాయకచవితి వేడుకలు..
2/7
సింగపూర్‌లోని ఓ తెలుగు కుటుంబం ఘనంగా వినాయకచవితి వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం..
3/7
వినాయకచవితి సందర్భంగా సింగపూర్‌లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో గణపతిని అందంగా అలంకరించారు.
4/7
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సామూహికంగా భక్తి శ్రద్ధలతో వినాయకచవితి పూజను జరుపుకుంటున్న దృశ్యం..
5/7
పిల్లలు, పెద్దలు అందరూ కలిసి వినాయకచవితి వేడుకలు జరుపుకున్నారు.
6/7
భక్తి శ్రద్ధలతో భాద్రపద శుక్ల చవితిని పురస్కరించుకుని వినాయకచవితి పండుగను ఘనంగా నిర్వహించారు.
7/7
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో ఏర్పాటు చేసిన వినాయకచవితి వేడులకలను తెలుగు వారు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
Updated at - Sep 13 , 2024 | 12:45 PM