ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు

ABN, Publish Date - Jan 08 , 2024 | 10:59 AM

‘రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో రైతురాజ్యం వస్తుంది.. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొరుగున ఉన్న హైదరాబాద్‌ వెలిగిపోతుంటే, అమరావతి మాత్రం వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం సమకూరుతుందని.. ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘రా.. కదలిరా..’ పేరుతో చంద్రబాబు జిల్లాకో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో, సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు.

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 1/8

‘రా.. కదలిరా..’ పేరుతో చంద్రబాబు జిల్లాకో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో సభకు విచ్చేసిన చంద్రబాబు అందరికి విక్టరీ సంకేతం చూపుతున్న దృశ్యం.

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 2/8

తిరువూరులో సభ ప్రారంభానికి ముందు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం.

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 3/8

తిరువూరులోని ‘రా.. కదలిరా..’ సభ వేదికపై కూర్చొని ప్రజలకు అభివాదం తెలుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు...

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 4/8

తిరువూరులోని ‘రా.. కదలిరా..’ సభ వేదికపై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు..

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 5/8

తిరువూరులోని చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా..’ సభకు విచ్చేసిన మహిళా కార్యకర్తలు..

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 6/8

‘రా.. కదలిరా..’ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 7/8

పశ్చిమగోదావరి జిల్లా, ఆచంటలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘రా.. కదలిరా..’ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..

ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది: చంద్రబాబు 8/8

ఆచంటలో ఆదివారం సాయంత్రం చంద్రబాబు నిర్వహించిన ‘రా.. కదలిరా..’ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..

Updated at - Jan 08 , 2024 | 10:59 AM