Municipal workers: విశాఖలో మున్సిపల్ కార్మికుల అరెస్టు దృశ్యాలు..
ABN, Publish Date - Jan 02 , 2024 | 12:18 PM
విశాఖ: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెను మరింత ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా మంగళవారం విశాఖలోని వన్ టౌన్ ఏరియాలో డంపింగ్ యార్డ్ వద్ద సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు..
1/6
తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలోని వన్ టౌన్ ఏరియాలో డంపింగ్ యార్డ్ వద్ద సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.
2/6
మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో కొత్త వారితో చెత్తను తరలిస్తున్న దృశ్యం.
3/6
పోలీసులు కొత్త వారితో చెత్తను తరలిస్తుండడంతో వ్యాన్‌ను అడ్డుకుని రోడ్డుపై పడుకుని నిరసన తెలుతున్న మున్సిపల్ కార్మికులు..
4/6
తమ సమస్యలు పరిష్కిరంచకపోతే ఇక్కడే ఉరి వేసుకుంటానని ఓ మహిళా కార్మికురాలు పోలీసులకు చెబుతున్న దృశ్యం.
5/6
శాంతయుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకుంటున్న మహిళ కార్మికులు.
6/6
వన్ టౌన్ ఏరియాలో ఏర్పాటు చేసిన తాడు వలయాన్ని దాటుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు..
Updated at - Jan 02 , 2024 | 12:18 PM