పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు

ABN, Publish Date - May 02 , 2024 | 08:32 AM

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దోచేశారని, వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం, రాత్రి విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్‌లో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ పాలన మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అన్న చందంగా సాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకులు తమ భూములు దోచేశారన్న మాటే వినిపిస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎక్కడికక్కడే భూములు ఆక్రమించుకుంటున్నారని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 1/6

అనకాపల్లి నియోజకవర్గంలోని ఎలమంచిలి, అచ్యుతాపురం జంక్షన్ వద్ద నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 2/6

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం అనకాపల్లి నియోజకవర్గంలోని ఎలమంచిలి, అచ్యుతాపురానికి వస్తు్న్న సందర్భంగా మహిళలు కోలాటం నిర్వహిస్తున్న దృశ్యం.

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 3/6

అనకాపల్లి నియోజకవర్గంలోని ఎలమంచిలి, అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 4/6

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖలోని పెందుర్తిలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్.. ప్రక్కన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు తదితరులను చూడవచ్చు.

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 5/6

విశాఖలోని పెందుర్తిలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు అభివాదం తెలుపుతున్న పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు 6/6

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖలోని పెందుర్తిలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు తదితరులను చూడవచ్చు.

Updated at - May 02 , 2024 | 08:32 AM