CM Chandrababu: ఏపీలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం
ABN, Publish Date - Nov 02 , 2024 | 02:55 PM
విశాఖపట్నం పరవాడ వెన్నెల పాలెం జంక్షన్ వద్ద రోడ్ల మరమ్మతు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా గుంతలను పూడ్చారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయం అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
1/16
అనకాపల్లి జిల్లా పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
2/16
వెన్నెలపాలెంలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం
3/16
చంద్రబాబుతో కలిసి గుంతలు పూడుస్తున్న మంత్రులు అనిత, కొల్లురవీంద్ర, బీసీ జనార్ధన్
4/16
గుంతలు పూడ్చిన అనంతరం నీళ్లు పోస్తున్న సీఎం చంద్రబాబు
5/16
పరవాడలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి
6/16
సీఎంతో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్ధన్
7/16
స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లడుతున్న చంద్రబాబు
8/16
ఏపీలో గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం అన్న సీఎం
9/16
గుంతల రోడ్లు నరకానికి రహదారులు... రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యాయి.. ఈ పాపం గత పాలకులదే అంటూ మండిపడ్డ చంద్రబాబు
10/16
గత జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి
11/16
చంద్రబాబును శాలువాతో సత్కరించిన టీడీపీ నేతలు
12/16
సభలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు
13/16
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
14/16
స్వయంగా బుల్డోజర్ నడిపిన ఏపీ సీఎం
15/16
బుల్డోజర్పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం
16/16
బుల్డోజర్ నడుపుతూ గుంతలను పూడ్చుతున్న సీఎం చంద్రబాబు
Updated at - Nov 02 , 2024 | 02:55 PM