Share News

Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:15 PM

వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి రావాలనుకునే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది.

Immigration: ఇండియన్స్‌కు షాక్..ఈ దేశం వెళ్లాలంటే భారీగా ఆదాయం..
UK has increased the family visa income

వలసల సంఖ్యను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం(british government) తీసుకున్న కీలక నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి రాగా, ఇది భారతీయులపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబ వీసాపై ఈ దేశానికి వెళ్లే పౌరులకు(immigration standards) అవసరమైన కనీస ఆదాయాన్ని బ్రిటన్ 55 శాతం పెంచింది. దీంతో ఎవరైనా వారి ఫ్యామిలీ వీసాకు స్పాన్సర్ చేయాలంటే ఇప్పుడు వారి కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు(రూ. 30.25 లక్షలు) ఉండాలి. ఇది గతంలో 18,600 పౌండ్లుగా(రూ.19.40 లక్షలు) ఉండేది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.


చట్టపరమైన వలసలను తగ్గించడానికి, అక్కడికి వచ్చే ప్రజల నుంచి పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తొలగించడానికే ప్రధాన మంత్రి రిషి సునక్, హోం సెక్రటరీ జేమ్స్ క్లీవర్లీ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి అధికారులు అన్నారు. నిలకడలేని వలసలను తగ్గించడానికి, బ్రిటీష్ కార్మికులు, వారి వేతనాలను రక్షించడానికి, భవిష్యత్తుకు సరిపోయే ఇమ్మిగ్రేషన్(immigration) వ్యవస్థను రూపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

దీంతో కుటుంబ వీసాపై తమ బంధువులను బ్రిటన్‌కు తీసుకురావాలనుకునే భారతీయ సంతతికి(indian origin) చెందిన వారిపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. అయితే ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రెండు దశల్లో ఈ పెంపు విధానాన్ని అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనల వల్ల వలసలు దాదాపు 3 లక్షల వరకు తగ్గుతాయని అక్కడి అధికారులు భావిస్తున్నారు.


ఇది కూడా చదవండి:

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా ఎఫ్‌పీఓ..రూ.18 వేల కోట్ల సమీకరణే లక్ష్యం


Gold and Silver Rates: మళ్లీ పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి..ఈసారి ఏంతంటే


మరిన్ని ప్రవాస వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 12:18 PM