Share News

Election Results:ఏపీలో గెలుపు.. లండన్‌లో సంబరాలు..

ABN , Publish Date - Jun 04 , 2024 | 09:29 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.

Election Results:ఏపీలో గెలుపు.. లండన్‌లో సంబరాలు..
TDP NRI Cell

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలుపును తమ గెలుపుగా విశ్వవ్యాప్తంగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో లండన్‌లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఘణ విజయం సాధించడంతో మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి టీడీపీ గెలుపును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొవెంట్రీ సిటీ తెలుగు యువత అధ్యక్షుడు లింగా రవితేజ , జాడ్డ అంజి , లగడపాటి భార్గవ్ , శశాంక్ , కృష్ణ , హరి , సందీప్ , నాయుడు , అఖిల్ , మనోజ్ , అవినాష్ , జెపి , పూర్ణ పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ గెలుపులో ఎన్‌ఆర్‌ఐలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

NTR-బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్‌ 101 జయంతి ఉత్సవాలు

NRI: అంజయ్య చౌదరితో యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం

మరిన్ని ప్రవాస వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2024 | 09:29 PM