Share News

Elon Musk: చిక్కుల్లో భారత సంతతి వైద్యురాలు.. నేనున్నానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:30 PM

కొవిడ్ సమయంలో ప్రభుత్వ టీకా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి చిక్కుల్లో పడ్డ భారత సంతతి వైద్యురాలు డా. కుల్విందర్ కౌర్ గిల్‌కు అండగా నిలిచేందుకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు.

Elon Musk: చిక్కుల్లో భారత సంతతి వైద్యురాలు.. నేనున్నానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్

ఎన్నారై డెస్క్: కొవిడ్ సమయంలో కెనడా(Canada) ప్రభుత్వ టీకా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి చిక్కుల్లో పడ్డ భారత సంతతి వైద్యురాలు డా. కుల్విందర్ కౌర్ గిల్‌కు (Dr. Kulwinder Kaur Gill) అండగా నిలిచేందుకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ముందుకొచ్చారు. న్యాయఖర్చుల కింద ఆమె చెల్లించాల్సిన డబ్బును ‘ఎక్స్’ (ట్విట్టర్) చెల్లిస్తుందని చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా తాను ఈ సాయం చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు (Elon Musk help pay legal fees).

WETA-డాలస్ లో దిగ్విజయంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం!

కెనడాకు చెందిన డా. గిల్.. కరోనా సమయంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్లు, తప్పనిసరి టీకాకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఫెడరల్ ప్రభుత్వంతో పాటూ ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వ తీరుతెన్నలపైనా విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెట్టారు. దీంతో, డా.గిల్‌పై సంప్రదాయ మీడియాతో పాటూ అనేక వైద్య సంఘాలు కూడా మండిపడ్డాయి. మరోవైపు, ట్విట్టర్ ఆమె పోస్టులను తొలగించింది. ఆమె రికార్డుల్లోనూ ఈ ఉదంతం ఓ శాశ్వతమైన మచ్చగా మిగిలిపోయింది.


ఈ క్రమంలో డా. గిల్ తన హక్కుల కోసం ఉద్యమించారు. 23 మంది డాక్టర్లు, జర్నలిస్టులు, న్యూస్ పేపర్లు తనకు వ్యతిరేకంగా, పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. కానీ, న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. తన విమర్శకుల గొంతునొక్కేందుకు డా. గిల్ ప్రయత్నించిందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, డిఫెండెంట్ల న్యాయఖర్చులన్నీ ఆమే చెల్లించాలని ఆదేశించింది. దీంతో, ఆమె సుమారు రూ.1.83 కోట్లు న్యాయఖర్చుల కింద చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా ఆమె దాచుకున్న సొమ్మంతా ఖర్చైపోవడంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆమె ప్రజలు, తన మద్దతుదారుల సహాయాన్ని అర్థించింది. ఆమె ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్ గురించి మస్క్‌కు తెలియడంతో ఆమె చెల్లించగా మిగిలిన మొత్తాన్ని ట్విట్టర్ చెల్లిస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 08:40 PM