Share News

WETA-డాలస్ లో దిగ్విజయంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం!

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:03 PM

ప్రాంతాలకు మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్షలేని WETA ఆధ్వర్యంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ మహానగరము "ఫ్రిస్కో" లోని ఇండిపెండెన్స్ హై స్కూల్ లో నిర్వహించారు.

WETA-డాలస్ లో దిగ్విజయంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం!

ప్రాంతాలకు మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్షలేని WETA ఆధ్వర్యంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ మహానగరము "ఫ్రిస్కో" లోని ఇండిపెండెన్స్ హై స్కూల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గావచ్చిన ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ పో టెం మేయర్ "జోన్ కీటింగ్" కీలకోపన్యాసం చేశారు.అతిథి వక్తలు అవార్డు గెలుచుకున్న టెక్ లీడర్ "ఏమీ జుచ్లెవ్స్కీ" మరియు అంబికా దద్వాల్, ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్, ప్రస్తుత సందర్భంలో మరియు సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సమాజ సేవకు గాను "సురోమా సిన్హా" మరియు "మెర్సీ స్ట్రిక్‌ల్యాండ్"లకు ఆదర్శప్రాయమైన సేవా పురస్కారాలు అందించబడ్డాయి.ఈ కార్యక్రమానికి వీణా యలమంచిలి “వ్యాఖ్యాత" గా వ్యవహరించారు.

TANA: వాషింగ్టన్ డిసిలో తానా విజయోత్సవ సభ

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రముఖ తెలుగు ప్లేబాక్ సింగర్ "సుమంగళి" మరియు శ్రీకాంత్ లంక పాటలతో ప్రేక్షకులను హుషారు నింపి హోరెత్తించారు. "తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే "మహిళ సాధికారతే "లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను 2019 లో ఉత్తర అమెరికాలో , ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

WETA లక్ష్యాలు

స్త్రీలకు సరైన నైపుణ్యాలను అందించడం, సాధికారత, శక్తినివ్వడం మరియు జ్ఞానోదయం చేయడం, తద్వారా వారు సమాజానికి సానుకూల సహకారం అందించడం.మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది.ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్‌ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు లోకల్ WETA టీం నవ్య స్మృతి రెడ్డి , ప్రతిమ రెడ్డి, గాయత్రి గిరి లకు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.రత్నమాల వంక -BOD,సునీత గంప -సోషల్ మీడియా చైర్,కమ్యూనిటీ ఔట్రీచ్ , విశ్వా వేమిరెడ్డి -BOD పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 02:04 PM