Share News

NRIs Rally: ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని అమెరికా, యూకేలో ర్యాలీ, ప్రార్థనలు

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:52 AM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలని విదేశాల్లోని భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూకే సహా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

NRIs Rally: ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని అమెరికా, యూకేలో ర్యాలీ, ప్రార్థనలు

భారత్‌లో మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం రావాలని ఇతర దేశాల్లోకి భారతీయులు పెద్ద ఎత్తున ర్యాలీ(rally) నిర్వహించారు. ఇటివల యూకేలోని లండన్‌లో పెద్ద ఎత్తున కార్ ర్యాలీని చేపట్టారు. నార్త్‌టోల్ట్‌లోని కచ్ పాటిదార్ సమాజ్ కాంప్లెక్స్ నుంచి వెంబ్లీలోని స్వామినారాయణ్ బీఎపీఎస్ టెంపుల్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. భారతదేశంలో జరగబోయే ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, BJPకి తమ మద్దతును తెలిపేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు అక్కడి నిర్వహకులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మళ్లీ గెలిపించాలని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ BJP (OFBJP) అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హిందూ దేవాలయంలో ప్రత్యేక 'హవన్'ని నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP), USA శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 'హవన్'కు పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు హాజరయ్యారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, మెజారిటీ భారతీయులు, ఎన్నారైల కోరికల నెరవేర్పు కోసం సామూహిక ప్రార్థన చేసినట్లు అక్కడి ప్రతినిధులు వెల్లడించారు.


ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 400కు పైగా సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బీజేపీ ఒంటరిగా 370కి పైగా సీట్లు గెలుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: TG Politics: మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం!

Updated Date - Mar 19 , 2024 | 09:52 AM