Share News

Weight loss : ఖచ్చితమైన బరువు తెలియాలంటే మాత్రం ఈ టైం లోనే చెక్ చేసుకోవాలట..

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:46 PM

వారానికి ఒకసారి బరువు చెక్ చేసుకోవడానికి ఒకరోజును నిర్ణయించుకోవాలి. రోజూ నీరు తీసుకోవడంలో, ఆహారం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.

Weight loss : ఖచ్చితమైన బరువు తెలియాలంటే మాత్రం ఈ టైం లోనే చెక్ చేసుకోవాలట..
body weight

బరువు పెరగడం అనేది మన చేతుల్లో ఉన్న పని కాకపోయినా, బరువు తగ్గడం మనచేతిలోనే ఉంది. దీనికి ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. బరువు తగ్గడం అనేది అంత సులభమైన ప్రక్రియ అయితే కాదు. చాలా మంది కొత్త సంవత్సరంలోకి రాగానే ఇలా చేయాలి అలా చేయాలనే నియమాలను పెట్టుకుంటూ ఉంటారు. ఇందులో బరువు తగ్గడం కూడా ఓ తీర్మానమే. అయితే ఈ వాగ్దానం చేసుకున్నాకా అసలు బరువు తగ్గించడం ఎలా? దీనిని ఎప్పుడు ఏ సమయంలో చూసుకోవాలి. అనేది చూద్దాం.

తాజా అధ్యయనం ప్రకారం, బరువు తగ్గడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న పనే..

నిపుణులు ఏం అంటున్నారు అంటే..

బరువును తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు శరీర బరువు తగ్గడం లేదా అంగుళాలు తగ్గడం..అనేది చూసుకోవాలి.

1. వారానికి ఒకసారి బరువు చెక్ చేసుకోవడానికి ఒకరోజును నిర్ణయించుకోవాలి. రోజూ నీరు తీసుకోవడంలో, ఆహారం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.

2. బరువు చూసుకునే విధానంలో ఎప్పుడూ ఒకే విధానాన్ని అనుసరించడం ముఖ్యం. ఒకే సమయం, వారంలో ఒకే రోజును ఎంచుకోవాలి.

3. ఆరోగ్యం విషయానికి వస్తే ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. బరువు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. క్రమం తప్పకుండా ఆహార నియమాలను, పద్దతులను పాటించాలి.

4. బరువు తగ్గడం చాలా ఛాలెంజింగ్ టాస్క్. అయితే సరైన డైట్ పాటిస్తే బరువు సులభంగా తగ్గవచ్చు. కాబట్టి శరీర అవసరాలను తీర్చే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: ఒత్తిడి వల్ల శరీరంలో కలిగే మార్పులు, ప్రభావాలు ఎలా ఉంటాయంటే..!!


5. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి.

6. తప్పనిసరిగా క్యాలరీల ట్రాకర్ ని ఉపయోగించాలి.

7. తినే ఆహారంలోపై శ్రద్ధతో పాటు వ్యాయామం చేసేందుకు సిద్ధం కావాలి. కేలరీలని బర్నే చేయాలనే విషయంలో పట్టుదలగా ఉండాలి.

8. రాత్రిపూట భోజనం చేసే సమయాన్ని కాస్త ముందుకు జరిపి సాయంత్రం ఏడుగంటలకే భోజనం పూర్తి చేయాలి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహకరిస్తాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 10 , 2024 | 02:46 PM