Share News

Best Teas : ధమనులను క్లియర్ చేసే 7 ఉత్తమైన టీలు ఇవే ..!

ABN , Publish Date - May 30 , 2024 | 04:48 PM

బరువు తగ్గడానికి గ్రీన్ టీ మంచి ప్రత్యామ్నాయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీధమనులలో పేరుకున్న ఫలకాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ సిప్ చేయడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్ ఇబ్బంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Best Teas : ధమనులను క్లియర్ చేసే 7 ఉత్తమైన టీలు ఇవే ..!
Best Teas

ఉదయాన్నే టీ (Rich Green Tea) తాగకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఉదయాన్నే టీకి అలవాటు పడినవారు ఎందరో.. అయితే హెల్బల్ టీలతో అయితే శరీరానికి, ఇటు మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ హెర్బల్ టీలు ఇప్పుడు మరీ ఎక్కువగా తాగుతున్నారు. ఒక్కో టీకి ఒక్కో ప్రత్యేకత ఉంది.

ఆరోగ్యకరమైన గుండెకు హెర్బల్ టీలు.. గుండె ఆరోగ్యానికి టీ సరిపోతుందంటే నమ్మలేం కదా... కానీ ఈ టీలతో ఆరోగ్యానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ..

బరువు తగ్గడానికి గ్రీన్ టీ మంచి ప్రత్యామ్నాయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీధమనులలో పేరుకున్న ఫలకాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ సిప్ చేయడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్ ఇబ్బంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు అందుతాయి.

అల్లం టీ..

ఈ టీతో రక్త ప్రసరణను మెరుగుపరచుకోవచ్చు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రక్తం గడ్డకట్టడానికి సహకరిస్తుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.

Glowing Skin : ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ఈ రసాలు తాగండి సరిపోతుంది ..!


దాల్చిన చెక్క టీ..

ఇది బ్లడ్ షుగర్ ఉన్నవారికి, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి మంచి పానీయం. దీనిని గుండె మంటకు, శరీరక ఇబ్బందులను తొలగించుకోవడానికి తాగవచ్చు.

పసుపు టీ..

పసుపు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. టర్మరిక్ టీ రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.

మందార టీ

హైబిస్కస్ టీ, .యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ దీనిని తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

Summer : ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..


అర్జున టీ..

ఇది గుండె ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. కప్పు టీ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులోని పోషకాలు రక్తప్రసరణకు సపోర్ట్ ఇస్తాయి. గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తాయి.

అశ్వగంధ టీ..

అశ్వగంధ అనేది ఒత్తిడిని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణను సాఫీగా చేస్తుంది. గుండె పనితీరువు మెరుగుపరుస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 30 , 2024 | 04:48 PM