Share News

Glowing Skin : ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ఈ రసాలు తాగండి సరిపోతుంది ..!

ABN , Publish Date - May 30 , 2024 | 03:51 PM

అలిసిన చర్మానికి ఉత్తేజాన్నిచ్చే విధంగా మంచి జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు ముఖ నిగారింపుకు కూడా పనిచేస్తుంది.

Glowing Skin : ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ఈ రసాలు తాగండి సరిపోతుంది ..!
Glowing Skin

వేసవిలో ఎండ కారణంగా చికాకు ఉంటుంది. ఇక ముఖ చర్మం వేడి గాలుల వల్ల ముఖం కందినట్టుగా మారుతుంది. ఇది చికాకు తెప్పిస్తుంది. చర్మ సంరక్షణలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన సంరక్షణ కూడా అవసరం. అయితే మొదటి విషయానికి వస్తే అన్ని ఆహారాలను కడిగి, ఉడికించి మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అయితే అలిసిన చర్మానికి ఉత్తేజాన్నిచ్చే విధంగా మంచి జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు ముఖ నిగారింపుకు కూడా పనిచేస్తుంది.

ఈ రిఫ్రెష్ బూస్ట్‌ర్ గురించి తెలుసుకుందాం.

ఉసిరికాయ జ్యూస్..

ఉసిరిలో అనేక పోషకాలున్నాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే ముడతలు పడిన చర్మానికి నిగారింపుతో పాటు, వృద్ధాప్యా సంకేతాలను తగ్గిస్తుంది.

15 - 20 మిల్లీ లీటర్ల ఉసిరి రసాన్ని తీసుకుని కొద్దిగా నీటిని కలిపి ఉదయం పరగడుపునే తాగాలి.

క్యారెట్, ఆరెంజ్ జ్యూస్..

క్యారెట్లు బీటా కెరోటిన్ కలిగి ఉంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మరుతుంది. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల శక్తివంతమైన జ్యూస్ ఇది.

మూడు క్యారెట్లు, చిన్నగా కట్ చేసి, జ్యూస్ కింద చేయాలి. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.


Summer : ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..

అలోవెరా జ్యూస్..

కలబంద హైడ్రేటింగ్ లక్షణాలున్నాయి. ఇది రంధ్రాలను మూకుపోకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడి, జిడ్డుగల చర్మాలకు అనుకూలంగా ఉంటుంది. కలబందలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని నయం చేయడంలో సహాయపడతాయి. 15-20 మిల్లీలీటరు కలబంద రసాన్ని తీసుకుని నీటిని కలిపి ప్రతిరోజూ భోజనానికి 30 నిమిషాల ముందుతీసుకోవాలి.

పుచ్చకాయ రసం..

పుచ్చకాయ రసం ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హానికరమైన UVకిరణాల నుంచి చర్మాన్నిరక్షిస్తుంది. తాజా పుదీనా ఆకులను వేసి కలగలిపి ఈ రసాన్ని తీసుకుంటే మంచి రీఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.

తులసి జ్యూస్..

తులసిలో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 30 , 2024 | 03:53 PM