Share News

Drinking: కాఫీ కంటే ఆరోగ్యకరమైన పానీయాలు ఇవేనట..!

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:18 PM

మాచా లాట్ కాఫీ రెండింటిలో ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యానికి కూడా మాచా మంచిది.

Drinking: కాఫీ కంటే ఆరోగ్యకరమైన పానీయాలు ఇవేనట..!
immune system

అధిక కెఫీన్ కంటెంట్ కారణంగా కాఫీతో కాస్త రిస్క్ లేకపోలేదు. కాఫీకి బదులుగా కాస్త ఆరోగ్యాన్ని పెంచే ఆహార పానీయాలను తీసుకోవచ్చు. కాఫీ కంటే కూడా మెరుగైన ఆరోగ్యకరమైన పానీయాలను గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన గ్రీన్ టీలో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాలు, కెఫిన్ కలయికతో ఉండి తాగగానే తక్షణ శక్తిని ఇస్తుంది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది.

మాచా లాట్

మాచా లాట్ కాఫీ రెండింటిలో ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యానికి కూడా మాచా మంచిది.

కొంబుచా

కొంబుచా కాఫీకి గొప్ప ప్రత్యామ్నాయం, ఇది తక్కువ కెఫిన్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువ గందరగోళం ఉన్నప్పుడు మెరుగైన నిద్ర కావాలంటే దీనిని తీసుకోవచ్చు. అలాగే ఇందులోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో కనిపించిన అరుదైన బైకాల్ టీల్ పక్షి.. !


మసాలా దినుసులతో..

పుసుపు, అల్లం, ఇతర మసాలా దినుసులతో చేసే టీలలో పాలను కలుపుతారు. పాలలో యాంటీ ఆక్సిడంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొవ్వును తగ్గిస్తాయి, దానితో బరువు కూడా తగ్గుతుంది.

కొబ్బరి నీరు..

సహజ ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయం, కొబ్బరి నీరు హైడ్రేట్ చేస్తుంది. ఉదయం పూట పరగడుపునే దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

చమెమిలే, మింట్ టీ..

చమెమిలే, మింట్ టీలను తీసుకోవడం వల్ల మనసుకు, శరీరానికి సపోర్ట్ నిస్తుంది. జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇవి మంచి ఔషదాలుగా పనిచేస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 17 , 2024 | 05:18 PM