Share News

Baikal Teal : మణిపూర్‌లో కనిపించిన అరుదైన బైకాల్ టీల్ పక్షి.. !

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:40 PM

కాలంతో ప్రకృతిలో వచ్చే మార్పులతో జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. మిగిలి ఉన్న జంతుజాలంలో కొన్ని అంతరించేవిగా ప్రమాదపు అంచులో ఉంటే, కొన్ని అరుదుగా కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Baikal Teal : మణిపూర్‌లో కనిపించిన అరుదైన బైకాల్ టీల్ పక్షి.. !
Baikal Teal

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, అందులో ఎన్నో వింతలు, విశేషాలు. ఇలా అన్నీ కలగలిపితేనే అందమైన సృష్టి. కానీ కాలంతో ప్రకృతిలో వచ్చే మార్పులతో జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. మిగిలి ఉన్న జంతుజాలంలో కొన్ని అంతరించేవిగా ప్రమాదపు అంచులో ఉంటే, కొన్ని అరుదుగా కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అందులోనూ కొన్ని అరుదైన జాతులు మన దేశంలో లేవని, విదేశాలకు మాత్రమే పరిమితమయ్యాయని అనుకుంటున్న తరుణంలో మొన్నామధ్య బీహార్‌లో కనిపించిన గోధుమరంగు బేర్ ఒకటైతే.. ఇప్పుడు కొద్దిరోజుల క్రితం మణిపూర్‌లో కనిపించిన బైకాల్ టీల్ బాతు జాతి పక్షి మరో అద్భుతం.

దాదాపు వందేళ్ళకు పైగా ఈ రష్యన్ పక్షి మన దేశంలో కనిపించలేదు. ఈ అరుదైన పక్షి రష్యన్ దేశానికి మాత్రమే పరిమితమైందని ఆధారాలు చెబుతున్నా తాజా నివేదికలు ఇవి మన దేశంలోనూ ఉన్నాయనే ధీమాను ఇచ్చాయి. వైల్డ్ లైఫ్ ఎక్స్ ఫ్లోరర్స్ మణిపూర్, ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్ వర్క్ బృందం మణిపూర్‌లోని చిత్తడి నేలల్లో బైకాల్ టీల్ పక్షిని కనుగొంది. ఈ పక్షి గతంలో రెండు సార్లు 1913, 1915 లో కనిపించిందని చెబుతున్నా దీనికి పక్కా ఆధారాలు లేవు. ఆ తర్వాత ఈ జాతి పక్షులను నేచురల్ హిస్టరీ సొసైటీ గుర్తించింది.

బైకాల్ టీల్ పక్షిని సూరిట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇది తూర్పు రష్యాలో చలికాలంలో సంతానోత్పత్తి చేస్తుంది. 2011కి ముందు దీనిని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చారు. ఈ పక్షి అంతరించిపోలేదని ఇది మన సరిహద్దుల్లో కనిపిస్తోందనే వార్త ఇప్పుడు అంతా వైరల్‌గా మారింది.



ఇది కూడా చదవండి; వింటర్ డైట్‌లో చేర్చుకునేందుకు 5 విటమిన్ డి డ్రై ఫ్రూట్స్.. !!

లాంఫెల్‌పట్ చిత్తడి నేలలో, ఈ మధ్యకాలంలో మాండరిన్ డక్ (ఐక్స్ గెలెరికులాటా), అంతరించిపోతున్న బేర్ పోచార్డ్, ఫెర్రుజినస్ పోచార్డ్, కామన్ పోచార్డ్ మొదలైనవి కెమెరాకు చిక్కాయి. కొంత కాలం క్రితం ఇంఫాల్ సమీపంలో ఒక ఆడ బైకాల్ టీల్ కెమెరాకు చిక్కిందనే వార్తలు వచ్చినా... దీనికి ఆధారాలు లభించలేదు.

Updated Date - Jan 17 , 2024 | 04:13 PM