Share News

The weather : ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి 7 చిట్కాలు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:12 PM

రెగ్యులర్ శరీరక శ్రమ మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి సమస్య తగ్గుతుంది. హార్మోన్ల విడుదలకు కూడా సహాయపడుతుంది.

The weather : ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి 7 చిట్కాలు..
physical benefits.

మానసిక ఆరోగ్యానికి వాతావరణం కూడా సహకరించాలి. గందరగోళ పరిస్థితుల్లో మానసికంగా మనసు దెబ్బతినడమే అవుతుంది. మనసు బాగాలేనప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉండే విధంగా పరిస్థితులను మార్చుకోవాలి. దీనికి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా తప్పనిసరి. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటే మానసికంగా బలంగా ఉన్నట్టే.. దీనికోసం ఏం చేయాలంటే..

1. తక్కువ సహజ కాంతి కొన్నసార్లు శరీరంలో రసాయన మార్పులను చేస్తుంది. ఇది శీతాకాలపు ఒత్తిడికి దారితీస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచడానికి కొన్న చిట్కాలను పాటిస్తే సరి.

2. చలికాలం మానసిక ఆరోగ్యానికి సవాలుగా ఉంటుంది. SAD సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనేది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్య, ఇది సీజన్‌కి తగినట్టు శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది.

3. సూర్యరశ్మిని పెంచే విధంగా సహజమైన కాంటి సెరోటోనిన్ అనే హార్మోన్ ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని, స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి: మాయచేసి తప్పించుకోవడంలో ఈ తిమింగలం కన్నా తెలివైన జంతువు లేదంటే నమ్ముతారా..!!


4. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి.. మంచి నిద్ర జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది.

5. ఒత్తిడి తగ్గేవిధంగా కొన్ని నచ్చిన పనులను ఎంచుకోవడం మంచిది. శీతాకాలం మానసిక స్థితికి ఇది సహకరిస్తుంది.

6. స్నేహంగా మాట్లాడటం, నలుగురితో నవ్వుతూ సమయాన్ని గడపడం కూడా మానసిక స్థితిని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒంటరిగా ఉండేవారు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం నలుగురితోనూ సమయాన్ని గడిపేందుకే చూడాలి.

7. మెరుగైన వ్యాయామం.. రెగ్యులర్ శరీరక శ్రమ మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి సమస్య తగ్గుతుంది. హార్మోన్ల విడుదలకు కూడా సహాయపడుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 05 , 2024 | 05:15 PM