Share News

Dwarf Sperm Whale: మాయచేసి తప్పించుకోవడంలో ఈ తిమింగలం కన్నా తెలివైన జంతువు లేదంటే నమ్ముతారా..!!

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:06 PM

వేటాడే జంతువులు అది రక్తంగా భావిస్తాయి. నీటిలో ద్రవం మొత్తం అలముకుని మార్గం కనిపించకుండా కాస్త గందరగోళానికి గురిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

Dwarf Sperm Whale: మాయచేసి తప్పించుకోవడంలో ఈ తిమింగలం కన్నా తెలివైన జంతువు లేదంటే నమ్ముతారా..!!
Dwarf Sperm Whale

తిమింగలం తలుచుకోగానే ఓ భారీఖాయం గుర్తుకు వస్తుంది. ఈ చేపజాతుల్లో చాలా రకాలు మనకు తెలిసినా, అవన్నీ తిమింగలాలు అంత భారీ ఖాయంతో అయితే కనిపించవు. కానీ అచ్చం తిమింగలాన్ని పోలిన జీవులు ఉన్నాయని తెలుసా.., అందులో ఈ జీవి గురించి చెప్పుకునేందుకు కాస్త పెద్ద విశేషమే ఉంది. అదేమిటంటే..

మరుగుజ్జు స్పెర్మ్ వేల్.. ఇది తిమింగలంలా కనిపించే పిగ్మీ స్పెర్మ్ వేల్, చిన్న తిమిగలంలానే.. కాకపోతే కొంచెం పెద్ద జాతి. 1878 నుంచి 1998 వరకూ తిమింగలాలతో సమంగా గుర్తించినా 1990వ దశకంలో వీటిని శాస్త్రవేత్తలు వేర్వేరు జాతులుగా గుర్తించారు.

ఇవి రెండు జాతులుగా విభజించినా రెండు వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నాయి. కొన్ని అట్లాంటిక్ మహాసముద్రంలోనూ, మరోజాతి ఇండో పసిఫిక్ మహాసముద్రంలోనూ నివసిస్తున్నాయి.

స్పెర్మ్ వేల్ తిమింగలాలు 6.6 అడుగుల నుంచి 8.9 అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి. వాటి బరువు 300 నుంచి 600 పౌండ్ల మధ్య ఉంటుంది.

స్పెర్మ్ తిమింగలాలు 14-26 దిగువ దంతాలు , 6 వెస్టిజియల్ పైన పళ్ళు కలిగి ఉంటాయి.

ఈ తిమింగలాలు వేరే జంతువులు వేటాడాలని చూస్తే మాత్రం ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మాయ చేస్తాయి. అదీ కూడా మనుషులకు మాత్రమే ఉండేంత తెలివితో ఆ ప్రమాదాన్ని దాటేస్తాయి. అదెలాగంటే..

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ మొక్కలను చీడపీడల నుంచి ఎలా కాపాడుకోవాలంటే..!


మరుగుజ్జు స్పెర్మ్ వేల్ స్పెర్మ్ తిమింగలాలకు పాయువు దగ్గర ఎరుపు-గోధుమ రంగు ద్రవం సంచిని ఉంటుంది. మిగతా జంతువులు వేటాండేందుకు చూసినప్పుడు ఇవి ఒత్తిడికి గురైనప్పుడు లేదా బెదిరింపులకు గురైనప్పుడు ఈ ద్రవాన్ని విడుదల చేస్తాయి. దాదాపు 12 లీటర్ల లిక్విడ్ ని విడుదల చేస్తాయి. ఇది నల్ల సిరాను విడుదల చేసే స్క్విడ్‌ల మాదిరిగా ఉంటుంది.

దీంతో వేటాడే జంతువులు అది రక్తంగా భావిస్తాయి. నీటిలో ద్రవం మొత్తం అలముకుని మార్గం కనిపించకుండా కాస్త గందరగోళానికి గురిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది.రెండవది అది ఆక్టోపస్ లాగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా దాడిలో ఉన్నప్పుడు తిమింగలం విడుదల చేసే ఊదారంగు ఎరుపు రంగు ద్రవం.

వేటాడే జంతువు ఈ మాయలో ఉండగానే వెంటనే స్పెర్మ్ వేల్ తప్పించుకుంటుంది. ఈ గుణం దానికి వలపన్ని తప్పించుకునే విధానం చాలా తెలివైన పద్దతి.

Updated Date - Jan 05 , 2024 | 12:18 PM