Share News

Cinnamon : దాల్చిన చెక్క నీరుతో త్వరగా ఇలా బరువు తగ్గేయండి..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:45 AM

సువాసనలో దాల్చిన చెక్క గొప్పది. దీనికి ఉన్న ప్రత్యేకమైన రుచి, సువాసనతో వంటకానికి మంచి రుచి వస్తుంది. అయితే ఈ దాల్చిన చెక్కను ఉపయోగించి బరువును ఇట్టే తగ్గించేసుకోవచ్చట.

Cinnamon : దాల్చిన చెక్క నీరుతో త్వరగా ఇలా బరువు తగ్గేయండి..!
weight loss

అందమైన ఆకృతి కోసం మనం తీసుకునే జాగ్రత్తలు, ఆహార పదార్థాలు అనేకం. అయితే తీసుకునే ఆహారంలో ఎలాంటి ప్రయోజనాలు మన శరీరానికి అందుతున్నాయి అనేది కూడా ముఖ్యం. మనం అందరం మామూలుగా వాడే వంటింటి దినుసులలో దాల్చిన చెక్కది ప్రత్యేకమైన స్థానం. అయితే సువాసనలో దాల్చిన చెక్క గొప్పది. దీనికి ఉన్న ప్రత్యేకమైన రుచి, సువాసనతో వంటకానికి మంచి రుచి వస్తుంది. అయితే ఈ దాల్చిన చెక్కను ఉపయోగించి బరువును ఇట్టే తగ్గించేసుకోవచ్చట. ఈ నీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.. అవేమిటంటే..

1. దాల్చిన చెక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరం మరింత ప్రభావవంతమైన కేలరీల బర్నింగ్‌ను సులభతరం చేస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు దారితీస్తుంది.

2. రక్తంలో చక్కర స్థాయిలను కూడా నియంత్రించడంలో దాల్చిన చెక్క సహకరిస్తుంది. అతిగా తినాలనే కోరికను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానిక సహకరిస్తుంది.

3. దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసా..!


4. దాల్చిన చెక్కలోని జీర్ణక్రియను ఇస్తాయి. అలాగే పోషకాలను కూడా అందిస్తాయి. జీర్ణం కాని ఆహారం పేరుకుపోకుండా బరువుతగ్గించడంలో దాల్చినచెక్క సహకరిస్తుంది.

5. ఊబకాయం, కడుపులో మంట లక్షణాలకు సంబంధించి ఇందులోని యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాల కారణంగా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క నీటిని తయారు చేయడం ఎలా :

కావలసినవి:

1 దాల్చిన చెక్క పొడి ఒక టీస్పూన్, 1 నుండి 1.5 లీటర్ల నీరు, ముందుగా నీటిని మరిగించాలి. మరిగే నీటిలో దాల్చిన చెక్క పొడిని వేయాలి. ఇది సుమారు 15-20 నిమిషాలు మరగనీయాలి. మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టాలి. దాల్చిన చెక్క నీటిని వెచ్చగా త్రాగడానికి ప్రయత్నించాలి. రుచి కోసం నిమ్మకాయ లేదా ఒక టీస్పూన్ తేనెను కలపవచ్చు, దాల్చిన చెక్క నీటిని మితంగా త్రాగాలి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 11 , 2024 | 11:45 AM