Share News

Drinking milk daily: రోజూ పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసా..!

ABN , Publish Date - Jan 10 , 2024 | 04:34 PM

బరువు తగ్గించే ప్రమాణంలో ఉన్నప్పుడు కూడా పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి.

Drinking milk daily: రోజూ పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసా..!
Drinking milk daily

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అనుకున్నాకా ఆ జాబితాలో ముందు వరుసలో పాలు తప్పకుండా ఉంటాయి. మెటిమలు, కడుపు సమస్యల వరకు పాలు కారణం అవుతాయట. పాలలో చాలా ఉపయోగకరమైన పోషకాలున్నప్పటికీ ప్రతి రోజూ తాగితే శరీరంలో ఏం జరుగుతుంది.. రోజూ పాలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎటువంటి పరిణామాలుంటాయనేది తెలుసుకుందాం.

రోజూ పాలు తాగడం వల్ల..

ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పాలు చాలా మంచి పోషకాహారం, ప్రోటీన్ మూలం, కాల్షియం, విటమిన్ డి ను కలిగి ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి రెండు ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. రోజూ పాలను తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ళు దృఢంగా మారతాయి.

బరువు..

బరువు తగ్గించే ప్రమాణంలో ఉన్నప్పుడు కూడా పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి.

కార్బోహైడ్రేట్లు శక్తిని, ప్రోటీన్

ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. మధుమేహం..

క్రమం తప్పకుండీ పాలు తాగడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలతో భర్తీ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా లేదా సమతుల్యంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: శీతాకాలపు దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడే 11 ఆహారాలు..ఇవే..!


గుండె ఆరోగ్యం..

పాలు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంలో.. పాలలో పోటాషియం కంటెంట్ కారణంగా స్ట్రోక్, కార్టియోవాస్కులర్ డిసీజ్, హైపర్ టైన్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ డైరీ ఉత్పత్తులతో స్ట్రోక్ రిక్స్ ఉన్నవారిలో అధిక ప్రమాదం ఉందని కూడా నమోనాలు చెబుతున్నాయి.

పాలతో సంబంధం ఉన్న ప్రమాదాలు..

వివాదాస్పద అధ్యయనాలు.. పాలు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరిలో ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. కాల్షియం కెమోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల పాలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు, మల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధన తెలిపింది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 10 , 2024 | 04:36 PM