Share News

Cold And Cough : శీతాకాలపు దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడే 11 ఆహారాలు..ఇవే..!

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:08 PM

ఈ విటమిన్‌తో రోగనిరోధక శక్తి బలోపేతం చేయవచ్చు. సిట్రస్ పండ్ల.. విటమిన్ సి, కివి పండు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, రెడ్ బెల్ పెప్పర్, బ్రస్సెల్స్, మొలకలు, బటర్‌నట్, కాంటాలోప్, కాలీఫ్లవర్, టొమాటోలు మొదలైనవి ఈ వ్యాధులకు చక్కని పరిష్కారంగా ఉంటాయి.

Cold And Cough : శీతాకాలపు దగ్గు లక్షణాలను తగ్గించడంలో సహాయపడే 11 ఆహారాలు..ఇవే..!
coughing

శీతాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఇలా చాలా రకాల ఆరోగ్య ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధులన్నీ చిన్న చిన్న ఆహారాలతో వీటిని తగ్గించుకోవచ్చు. అయితే వీటిని తగ్గించేందుకు వాడే ఆహార పదార్థాలపై ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి.

వెల్లల్లి... రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం, అల్జీమర్స్, చిత్తవైకల్యం నివారణకు సాయపడతుంది.

అల్లం.. దగ్గు, జలుబులతో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, వాపును తగ్గించడంలో పనిచేస్తుంది. ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ ఎఫెక్ట్స్ అల్లంలోని యాక్టివ్ కాంపోనెంట్స్ అయిన జింజెరోల్స్‌తో ముడిపడి ఉంటాయి. అల్లం బ్రోంకోడైలేటర్‌లాగా పనిచేస్తాయని, చికాకు, దగ్గు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించడానికి, గాలితీసుకునే మార్గాన్ని మృదువుగా చేసే కండరాలను సడలించదని పరిశోధనలు చెబుతున్నాయి.

తులసి.. తులసి భారతదేశంలో అనేక శతాబ్దాలుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది. ఇది శ్వాసకోశ నుండి శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, పొడి దగ్గుకు సమర్థవంతమైన నివారణ. తులసిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ ఏజెంట్, ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

పండ్లు, కూరగాయలు.. విటమిన్ సి జలుబును నివారిస్తుంది. ఈ విటమిన్‌తో రోగనిరోధక శక్తి బలోపేతం చేయవచ్చు. సిట్రస్ పండ్ల.. విటమిన్ సి, కివి పండు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, రెడ్ బెల్ పెప్పర్, బ్రస్సెల్స్, మొలకలు, బటర్‌నట్, కాంటాలోప్, కాలీఫ్లవర్, టొమాటోలు మొదలైనవి ఈ వ్యాధులకు చక్కని పరిష్కారంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించే వ్యాయామాలు ఇవే.. ప్రయత్నించి చూడండి..!


ఉల్లిపాయ రసం.. ప్రతి భారతీయ వంటగదిలో ఉల్లిపాయలు తప్పక ఉపయోగిస్తాం. ఈ ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనాలతో ముడిపడి ఉంటుంది. పొడి దగ్గు నివారణగా ఉల్లిపాయలను ఆరబెట్టి చూర్ణం చేసి, తేనెతో సమాన భాగాలతో కలపాలి. రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు ఒక టేబుల్ స్పూన్ మిశ్రమాన్ని తీసుకోవడం ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.

తేనె.. నిరంతర దగ్గు నుండి తేనె ఉపశమనం కలిగిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే తీవ్రమైన దగ్గు నుంచి తేనె తేలిక చేస్తుంది. యాంటీబయాటిక్స్ అవసరాన్ని తగ్గించిందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

వేడి ద్రవాలు.. అధ్యయనం ప్రకారం, వేడి పానీయాలు గొంతు నొప్పి, చలి, అలసట వంటి లక్షణాలకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. ఈ వేడి పానీయాలలో క్లియర్ బ్రోత్‌లు, హెర్బల్ టీలు, డీకాఫిన్ చేసిన బ్లాక్ టీ, వెచ్చని నీరు ఉన్నాయి. శీతాకాలపు దగ్గును పరిష్కరించడానికి ఈ సహజ నివారణలను తీసుకుంటే సరిపోతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 10 , 2024 | 03:08 PM