Blood Sugar: రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించే వ్యాయామాలు ఇవే.. ప్రయత్నించి చూడండి..!
ABN , Publish Date - Jan 10 , 2024 | 02:58 PM
యోగా శరీరంలో మొత్తం సంతులనం, బలాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో యోగా సహాయపడుతుంది.
ఆరోగ్యంగా ఉండటం అనేది శారీరకంగా దృఢంగా ఉంటేనే సాధ్యం అయ్యేపని. అందుకోసం శరీరాన్ని క్రమశిక్షణతో ఉంచాలి. కాలం ఏదైనా శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు కొన్ని వ్యాయామాలు తప్పనిసరి అవి.. శారీరక వ్యాయామాలు టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడే వ్యాయామాలు ఇవి. ఇన్సులిన్ సెన్నివిటీని మెరుగుపరుస్తాయి. కణాలు హార్మోన్లను మరింత ప్రభావితంగా చేస్తాయి. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన పద్దతిలో బరువును తగ్గిస్తాయి. వీటిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగల టాప్ వ్యాయామాలను చూద్దాం.
వాకింగ్
నడకను చాలా మంది ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతారు. దీని ద్వారా రక్తపోటు స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు, గ్లూకోజ్‌ని మెరుగుపరచవచ్చు. కనీసం 30 నిమిషాల చురుకైన నడక లేదా నిమిషానికి 100 అడుగులు వేయడం మధుమేహాన్ని నియంత్రించడానికి గొప్ప మార్గం.
సైక్లింగ్
సైక్లింగ్ గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీర సమతుల్యత, భంగిమను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.
డాన్స్
డ్యాన్స్ అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది.
పైలేట్స్
ఇది శ్వాస నియంత్రణలో సహాయపడుతుంది, శరీరం మొత్తం సమతుల్యత, భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది T2D ఉన్న రోగులకు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సమర్థవంతమైన వ్యాయామం.
ఇది కూడా చదవండి.. ఖచ్చితమైన బరువు తెలియాలంటే మాత్రం ఈ టైం లోనే చెక్ చేసుకోవాలట..
యోగా
యోగా శరీరంలో మొత్తం సంతులనం, బలాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో యోగా సహాయపడుతుంది.
తాయ్ చి
తాయ్ చి శ్వాస పద్ధతులు. ధ్యానంతో కలిపి చేస్తారు, ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి మంచి మార్గం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)