Share News

Coconut flower : యాంటీ బాక్టీరియల్ గుణాలున్న కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:28 PM

వేసవి కాలం కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన హైడ్రేట్ గా ఉంచుతుంది, శరీరంలోని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వలన మరింత చల్లగా ఉంటారు. ముఖ్యంగా కడుపులో చల్లగా అనిపిస్తుంది.

Coconut flower : యాంటీ బాక్టీరియల్ గుణాలున్న కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ..!
coconut flower

నీళ్లు ఆరిపోయిన కొబ్బరికాయలో కొద్దిరోజులకి పిలకలా ఓ మొలక (coconut flower) వస్తుంది. దానిని పగలగొట్టి చూస్తే లోపల తెల్లని గుజ్జులాంటి పదార్థం బంతిలా కనిపిస్తుంది. దీనిని తింటే కమ్మగా అచ్చం మన తాటి బుర్ర గుంజులా అనిపిస్తుంది. దీనిని కొబ్బరి పువ్వు లేదా కొబ్బరి ముత్యం, కొబ్బరి మొలక అనిపిలుస్తారు. కొబ్బరి కాయ దేవుడికి, శుభకార్యాలలో కొడుతున్నప్పుడు అందులో ఈ పువ్వు మొలక కానీ కనిపిస్తే అదృష్టమని భావిస్తారు. దీనిని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట. అవేంటో తెలుసుకుందాం.

కొబ్బరి కాయలానే, పువ్వు (coconut flower) కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కరిగే చక్కెరలు కూడా ఉన్నాయి.

ఈ పువ్వు తినడం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి సహాయపడుతుందంటారు, ఎందుకంటే ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాధారణంగా శరీరంలోని ఆమ్ల, ఆల్కలీన్ మూలకాలను సమతుల్యం చేసే ఆహారాలు అవసరం. కొబ్బరి పువ్వు(coconut flower)లో ఉండే అధిక ఖనిజాలు ఆ పని చేస్తాయి. అంటే దీనిని తీసుకోవడం వల్ల మూత్రాశయం, మూత్రపిండాలు సురక్షితంగా ఉంటాయి.

ఎండాకాలం చద్దన్నాన్ని తీసుకుంటే శరీరానికి ఎంత మేలో తెలుసా..!

మొత్తం మీద కొబ్బరి హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులోని కొవ్వు ఆమ్లాలు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌లను తొలగించడంలో సహాయపడతాయి, హార్మోన్ల సమతుల్యత చెక్కుచెదరకుండా ఉంటుంది. కాబట్టి ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని మిస్ చేసుకోకుండా తీసుకోవాలి. అంతేకాదు కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా.. బరువు తగ్గొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది.


గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!

వేసవి కాలం కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన హైడ్రేట్ గా ఉంచుతుంది, శరీరంలోని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వలన మరింత చల్లగా ఉంటారు. ముఖ్యంగా కడుపులో చల్లగా అనిపిస్తుంది. ఈ పువ్వు అతిసారం లేదా విరేచనాలు, వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. నెలసరిలో ఋతుస్రావం ఎక్కువగా ఉండటం వంటి ఇతర రక్తస్రావం సమస్యలలో కూడా సహాయపడుతుంది.

ఈ తెరచాపలు కూలర్ కన్నా చల్లదనాన్ని ఇస్తాయి.. వేసవిలో వట్టివేరు ఉపయోగాలెన్నో... !!

ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా పని చేస్తుంది. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తికి మూలం. ఇది థైరాయిడ్ తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 04 , 2024 | 03:28 PM