Share News

Summer Holidays : వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ఫ్లాన్ చేయండి.. !!

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:18 PM

పిల్లలను ప్రకృతిలో అందాలను ఆస్వాదించేలా ప్రకృతికి దగ్గరగా తిప్పాలి. ఇతరులతో కాస్త దగ్గరతనం పెరిగేలా ప్రోత్సహించాలి. ప్రతి చిన్నారి ఈ వేసవి సెలవులను ఆహ్లాదంగా మలచుకునేలా ప్రోత్సహించాలి. భక్తిని పెంచే సమయం కూడా ఇదే.

Summer Holidays : వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ఫ్లాన్ చేయండి.. !!
Kids

వేసవి వస్తుందంటే పిల్లలకు ఆ సంవత్సరం చదువు చివరికి వచ్చిందన్నమాటే.. పరీక్షలు అయిపోయి.. వేసవి సెలవులు ఇచ్చేస్తారు. ఇక దాదాపు రెండు నెలలపాటు పిల్లలకు ఆటవిడుపు. ఈ రోజుల్ని వాళ్ళకు నచ్చిన విధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. ఇదంతా ప్లాన్ చేయాల్సింది పెద్దలే. తల్లితండ్రులు అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర వదిలే సమయం. ఆటలు, పాటలు, కొత్తగా ఏదైనా నేర్చుకునే టైం కూడా ఇదే..

శీతాకాలం ముగిసి వేసవికాలంలోకి వచ్చిపడ్డాకా.. వేసవి సెలవుల్లో పిల్లల రోజుల్ని కాస్త యూనిక్ గా ఫ్లాన్ చేయాలి. స్మార్ట్ ఫోన్స్ పక్కన పెట్టి కొత్తగా ఏదైనా నేర్చుకునే విధంగా వాళ్లను ఎంగైజ్ చేయాలి. దీనికోసం పిల్లల బ్రెయిన్ డెవలప్ మెంట్, ఫిజికల్ ఫిట్ నెస్ మెరుగయ్యేందుకు పేరెంట్స్ తపించాలి. పిల్లలను ప్రకృతిలో అందాలను ఆస్వాదించేలా ప్రకృతికి దగ్గరగా తిప్పాలి.

ఇతరులతో కాస్త దగ్గరతనం పెరిగేలా ప్రోత్సహించాలి. ప్రతి చిన్నారి ఈ వేసవి సెలవులను ఆహ్లాదంగా మలచుకునేలా ప్రోత్సహించాలి. భక్తిని పెంచే సమయం కూడా ఇదే. రకరకాల పురాణ ఇతిహాసాల గురించి తెలిసేలా కథలను చదివి వినిపించడం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా ఈ సెలవుల్లోనే ప్లాన్ చేసుకుంటే సరి.

చిన్నరుల పనితీరుకు మెరుగయ్యేలా సైన్స్ ప్రయోగాలు, ఎక్స్ పరిమెంట్స్, చేసేలా చూడాలి. పుస్తక పఠనం, డ్రాయింగ్, పజిల్స్ వంటి వాటితో మానసిక వికాశం కలుగుతుంది. మ్యూజిక్, సింగింగ్, వంటివి నేర్పించడం కూడా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..


చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపే ఫ్లానింగ్..

టూర్స్ వెళ్ళిరావడం, ట్రెక్కింగ్, శరీర ధారుడ్యం పెచే యాక్టివిటీస్ ఇలా వాళ్లకు నచ్చిన వ్యాపకాల వైపు ప్రయాణిచేలా చేయాలి.

ప్రకృతిలో మమేకం కావాలి..

జంతువులతో పక్షులతో సమాయన్ని గడిపేలా చూడాలి. ఇంటి పెరటిలో కూరలు, మొక్కల పోషణ వంటి విషయాల్లో మెళకువలు నేర్పించాలి. గార్డెనింగ్ పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది.

కళలు..

పిల్లల్లో సృజనాత్మకతను పెంచే పెయింటింగ్ నేర్పించడం, బొమ్మలను గీయించడం, కాయితాలతో బొమ్మలు చేయడం వంటివి నేర్పించాలి.

ఫ్యామిలీతో.. కాసేపు..

బంధువులతో, స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేలా పిల్లల్ని స్నేహంగా కలిసేలా చేయాలి. చదువు ఒత్తిడులు మరిచిపోయి, సరదాగా కాలాన్ని గడిపే విధంగా ఫ్లాన్ చేయాల్సింది తల్లితండ్రులే.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 02:19 PM