Share News

Breakfast : ఓట్స్‌తో ఈ రుచికరమైన టిఫిన్స్ ట్రైచేసి చూసారా..!

ABN , Publish Date - Feb 03 , 2024 | 01:23 PM

ఓట్ మీల్ ఎనర్జీ బైట్స్‌ని తయారు చేయడానికి రోల్డ్ వోట్స్, వేరుశెనగ వెన్న, తేనె, మినీ చాక్లెట్ చిప్స్, చిటికెడు ఉప్పు కలిపి చేయాలి.

Breakfast : ఓట్స్‌తో ఈ రుచికరమైన టిఫిన్స్ ట్రైచేసి చూసారా..!
immune system

ఓట్స్‌తో అనేక రకాల రుచికరమైన వంటకాలను రూపొందించడానికి ఉపయోగించే బహుముఖ, పోషకమైన పదార్థం. ఇది పోషకమైన ఆహారం. ఉదయాన్నే అల్పాహారంగా చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ఐదు నోరూరించే ఓట్స్ వంటకాలు ఇవి.

ఓవర్నైట్ ఓట్స్బెర్రీలు, బాదంపప్పులతో..

మామూలుగా ఈ సమయంలోనే తీసుకోవాలనే రూల్స్ ఏం లేవు గానీ.. రాత్రిపూట కూడా ఓట్స్‌తో రిఫ్రెష్ కావచ్చు. దీనితో తయారు చేసే ఐదు రకాల పదార్థాలను తెలుసుకుందాం. రోల్డ్ ఓట్స్, పాలు, తేనె, బ్లూ బెర్రీస్ కలిపి తయారు చేసే ఈ పదార్థం రుచికరంగా ఉంటుంది. క్రీము ఇవన్నీకలిపి చేసే ఈ పదార్థం నోటికి రుచికరంగానే కాదు. దీనిని రాత్రి ఫ్రిజ్ లో ఉంచి ఉదయాన్నే తింటే బావుంటుంది. పాలతో ఉడికించిన ఓట్స్‌లో ఏ పదార్థాలను కలిపినా సరే కొత్త రుచిని ఆస్వాదించవచ్చు.

ఆపిల్దాల్చిన చెక్కతో వోట్మీల్..

ఆపిల్ దాల్చిన చెక్క పొడి కలిపి తయారుచేసే ఈ ఓట్మిల్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే తేనె కలపడం కూడా దీనికి అదనపు రుచిని తెస్తుంది.

ఇది కూడా చదవండి: మెగ్నీషియం లోపం కలిగితే ఇన్ని కష్టాలా...


వోట్మీల్ ఎనర్జీ బైట్స్..

ఓట్ మీల్ ఎనర్జీ బైట్స్ ని తయారు చేయడానికి రోల్డ్ వోట్స్, వేరుశెనగ వెన్న, తేనె, మినీ చాక్లెట్ చిప్స్, చిటికెడు ఉప్పు కలిపి చేయాలి. దీనిని కనీసం 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపైన ఈ ఎనర్జీ ప్యాక్డ్ బైట్‌లు వర్కౌట్ తర్వాత తీసుకుంటే సరైన అల్పాహారంగా సరిపోతుంది.

కూరగాయలతో వోట్స్..

కేవలం తీపి పదార్థాలతో మాత్రమే కాకుండా లేత కూరగాయలతో కలిపినా కూడా ఓట్స్ చక్కని రుచిని ఇస్తాయి. దీని కోసం బచ్చలి కూర, పుట్టగొడుగులు, వేయించి పెట్టుకున్న గుడ్డును కూడా దీనిలో కలిపి తయారు చేయాలి. దీనిలో రుచి కోసం పార్స్లీ చిప్స్ కలిపి ఇంకా బావుంటుంది.

ఓట్ మీల్ చాక్లెట్ చిప్స్..

ఓట్ మీల్ చాక్లెట్ చిప్ కుకీలను తయారు చేయవచ్చు. రోల్డ్ వోట్స్, పిండి, బేకింగ్ సోడా, వెన్న, బ్రౌన్ షుగర్, వెనిల్లా ప్లేవర్, చాక్లెట్ చిప్స్ కలిపి చేసే ఈ కుకీలు ఓవెన్‌లో బంగారు రంగుకు మారేంత వరకూ ఉంచి తీయడం వల్ల మంచి రుచితో తయారవుతాయి. ఈ ఐదు వోట్స్ వంటకాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు తేలికపాటి జీర్ణం కూడా అవుతాయి. వీటిని రోజువారి అల్పహారంలో చేస్తుకోవడం వల్ల ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ అందుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 03 , 2024 | 01:25 PM