Share News

Drinking pomegranate juice : గుండె ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మకాయ, రసం ఏది తీసుకున్నా బోలెడు బలం..!

ABN , Publish Date - May 25 , 2024 | 01:31 PM

దానిమ్మ అనే పేరు లాటిన్ పదబంధమైన పోమమ్ గ్రాంటం నుండి వచ్చింది. ఇది ఆపిల్‌లా కనిపిస్తూనే పండులోపల అనేక విత్తనాలతో ఉంటుంది. శాస్త్రవేత్తలు అరిల్స్ అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

Drinking pomegranate juice : గుండె ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మకాయ, రసం ఏది తీసుకున్నా బోలెడు బలం..!
pomegranate

దానిమ్మ పండు.. ఎర్రగా చూడగానే నోట్లో పెట్టుకోవాలనిపించే ఎర్ర ఎర్రని గింజలు.. దానిమ్మ పండు దీనిని పిల్లలు, పెద్దలు అంతా ఇష్టంగా తినాలనుకునే పండు. ఎర్రటి చర్మంతో కనిపించే ఈ పండు లోపలి భాగం అంతా పళ్ల వరుస లాంటి ఎర్రటి గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలోపలి జ్యూస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి దానిమ్మ చక్కని ఆహారం. మామూలుగా ఈ దానిమ్మ గింజలను తినలేనివారు సలాడ్స్, ఓట్ మిల్, హమ్మస్ ఇలా చాలా వంటకాల్లో వేసుకుని తింటూ ఉంటారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్ లక్షణాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ చికిత్స, నివారణలో కూడా మంచి ఉపయోగకరంగా పని చేస్తుంది.

దానిమ్మపండు...రసం

దానిమ్మ అనే పేరు లాటిన్ పదబంధమైన పోమమ్ గ్రాంటం నుండి వచ్చింది. ఇది ఆపిల్‌లా కనిపిస్తూనే పండులోపల అనేక విత్తనాలతో ఉంటుంది. శాస్త్రవేత్తలు అరిల్స్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు గ్రీన్ టీ, రెడ్ వైన్ కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి.

ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆహారాలలోని రసాయనాలు శరీరంలోని కణాలను ఇతర హానికరమైన రసాయనాల నుండి రక్షించడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మ పండుగా లేదా జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్నా కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Summer Halth Tips : ఎండలోంచి రాగానే నీరు తాగేస్తున్నారా.. అలా అయితే ఈ ఇబ్బంది తప్పదు.. !


గుండె ఆరోగ్యానికి మేలు..

1. దానిమ్మలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె, రక్త నాళాలలో వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

2. అథెరోస్క్లెరోసిస్, ధమనులలో కొలెస్ట్రాల్, కొవ్వుల నిర్మాణం, గుండె జబ్బులకు సాధారణంగా కారణం అవుతుంది.

3. అధిక రక్తపోటు, చికిత్స అందని పక్షంలో గుండె పోటుకు కారణం అవుతుంది.

4. దానిమ్మపండులోని ప్యూనికాలాజిన్స్ పాలీఫెనాల్ సమ్మేళనాలు ఈ ధమని గోడలు గట్టిపడకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 25 , 2024 | 01:31 PM