Share News

Paneer Good For Diabetes : డయాబెటిస్‌కు పనీర్ మంచిదా? దీన్ని డైట్‌లో ఇలా చేర్చండి..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:32 PM

పన్నీర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. చక్కెర కొవ్వులను, అధిక కేలరీలను తగ్గించి మధుమేహం ఆహారంలో ఫైబర్, పిండి పదార్థాలను, ప్రోటీన్ లను సమతుల్యం చేస్తుంది.

Paneer Good For Diabetes : డయాబెటిస్‌కు పనీర్ మంచిదా? దీన్ని డైట్‌లో ఇలా చేర్చండి..!
panner

మధుమేహంతో బాధపడే వారు కొన్ని పదార్థాలకు మాత్రమే పరిమితం అయిపోయి వారి ఆహారపు శైలిని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా పరిమితులుంటాయి. ఈ పరిస్థితిని దాటాలంటే అసలు మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది గుండెకు, ఇతర ప్రధాన అవయవాలకు చేసే మేలు ఏదైనా ఉందా అనేది తెలుసుకోవాలి. మనం ఎక్కువగా కూరల్లో వాడే పన్నీర్ ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే దీనిని మధుమేహం ఉన్న వారు తీసుకోవచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం.

పనీర్ వారి ఆహారంలో తీసుకుంటే అధిక-నాణ్యత ప్రోటీన్, అనేక విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న పనీర్, డయాబెటిక్ రోగులకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది. అతితక్కువ మొత్తంలో కార్బోహాడ్రేట్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పనీర్, మధుమేహానికి అనుకూలమైన ఎంపికగా పనిచేస్తాయి. గ్లైసెన్క్ కార్బోహైడ్రేట్ల రిచ్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. చక్కెర కొవ్వులను, అధిక కేలరీలను తగ్గించి మధుమేహం ఆహారంలో ఫైబర్, పిండి పదార్థాలను, ప్రోటీన్ లను సమతుల్యం చేస్తుంది.

పనీర్ ఎలా తీసుకోవాలి?

పన్నీర్‌ను డీప్ ఫ్రై చేయడం లేదా జీడిపప్పు, తాజా క్రీమ్‌తో కూడిన వంటలలో చేర్చడం మానుకోవాలి., ఎందుకంటే

1. ఆరోగ్యకరమైన పనీర్ సలాడ్: పనీర్ సలాడ్‌.. క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, తేలికపాటి మసాలాలతో పనీర్‌ను కలిపి పోషకాలు అధికంగా ఉండే ఈ వంటకం కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: ఒత్తిడి వల్ల శరీరంలో కలిగే మార్పులు, ప్రభావాలు ఎలా ఉంటాయంటే..!!


2. పనీర్ బేసన్ చీలా: డయాబెటిక్-ఫ్రెండ్లీ అల్పాహారం కోసం, పనీర్ బేసన్ చీలా కూడా ప్రయత్నించండి. ఇది కూడా తక్కువ మసాలా దినుసులతో చేసి తింటే చక్కని రుచితో పాటు కాస్త తింటేనే కడుపు నిండిపోతుంది.

3. బజ్రా పనీర్ పరాటా: బజ్రా పనీర్ పరాఠాతో శీతాకాలం పరాఠా తినడం బావుంటుంది. మిల్లెట్, పనీర్ కలిపి తింటే రుచిగా, మధుమేహానికి అనుకూలమైన ఆహారం కనుక, రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన పదార్థాలతో, డయాబెటిక్-ఫ్రెండ్లీ డైట్‌లో పనీర్‌ను చేర్చుకోవడం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే విధంగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 09 , 2024 | 04:32 PM