Share News

Turmeric Shot : పసుపు షాట్స్‌తో మరిన్ని ఆరోగ్యానికి పోషకాలు అందుతాయి.. ట్రైచేసి చూడండి..!

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:25 PM

శరీరంలోని అన్ని భాగాలలో కణజాలలా పెరుగుదలకు సహకరిస్తుంది. రోజువారి తీసుకోవాల్సిన 35% తో పసుపు, పైనాపిల్, వంటి వాటితో పసుపు షాట్ కలిపి తీసుకుంటే శరీరానికి చక్కని శక్తి లభిస్తుంది.

Turmeric Shot : పసుపు షాట్స్‌తో మరిన్ని ఆరోగ్యానికి పోషకాలు అందుతాయి.. ట్రైచేసి చూడండి..!
overall health

పసుపు మనందరి ఇండ్లలోనూ తప్పక వాడుకునే నిత్యవసర వస్తువు. పసుపుతో ఎన్నో ఉపయోగాలు.. దీనితో ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇక పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు టర్మరిక్ ఫాట్ తో ప్రతిరోజునూ ప్రారంభించడం వల్ల రోగనిరోధ శక్తిని పెంచుతుంది. నిమ్మరసంతో పైనాపిల్ జ్యూస్ను కలిపి తీసుకోవాలి. అంతే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను మెరుగైన జీర్ణక్రియ కోసం పసుపుతో తయారైన టర్మరిక్ షాట్ వాడుతున్నారు. దీనితో కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే..

1. శక్తిని పెంచుతుంది.

2. విటమిన్ సి పెరుగుతుంది.

3. జీర్ణ వ్యవస్థలో PH ను పెంచుతుంది.

4. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి.

5. మెరుగైన ఆరోగ్యానికి మంచిది.

1. శక్తిని పెంచుతుంది.

ఖాళీ కడుపుతో పసుపు షాట్లు తాగడం వల్ల రుచికరంగా ఉండటమే కాకుండా దీనితో శరీరం పోషకాలను తీసుకుంటుంది. ఉదయం ఉత్తేజంగా మారుతుంది.

2. విటమిన్ సి మోతాదు..

శరీరంలోని అన్ని భాగాలలో కణజాలలా పెరుగుదలకు సహకరిస్తుంది. రోజువారి తీసుకోవాల్సిన 35% తో పసుపు, పైనాపిల్, వంటి వాటితో పసుపు షాట్ కలిపి తీసుకుంటే శరీరానికి చక్కని శక్తి లభిస్తుంది.

ఇది కూడా చదవండి: బెండకాయను తింటే ఇన్ని బెనిఫిట్సా.. అవేంటంటే..!


3. కడుపు ఆరోగ్యానికి..

పసుపులోని గుణాలతో చాలా రకాల ప్రయోజనాల్లో భాగంగా ఉదరసంబంధమైన సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. పసుపు షాట్స్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. చక్కెర, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో pH అసమతుల్యత ఏర్పడవచ్చు. ఈ pH బ్యాలెన్స్‌ని సరిచేయడానికి ఫైబర్‌తో కూడిన క్లీన్ డైట్ తీసుకుంటే సరిపోతుంది, పసుపు షాట్లు ఈ ప్రక్రియలో సహాయపడతాయి. జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా తగ్గుతుంది.

మెరుగైన ఆరోగ్యానికి..

అనేక సంస్కృతులలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న పసుపులోని వైద్యం లక్షణాలు ఇప్పుడు ఆరోగ్యాన్ని సులభతరం చేయడానికి, సులభంగా, సౌకర్యవంతంగా, అందుబాటులో ఉండేలా చేయడానికి పసుపు షాట్ రూపంలో వస్తున్నాయి దీనిని ఉపయోగించడం వల్ల పసుపును తీసుకున్న రుచి అనిపించినా పోషకాలు మాత్రం త్వరగా శరీరానికి అందుతాయి. జ్యూస్ రూపంలో పసుపు షాట్ తీసుకోవడం ఇప్పడు మరింత తేలిక..

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 23 , 2024 | 04:26 PM