Share News

Horse gram : ఉలవల్ని ఆహారంగా తీసుకుంటే రక్త వృద్ధితో పాటు... ఇంకా దీనితో.. !

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:16 PM

ముఖ్యంగా ఉలవల విషయానికి వస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే వీటిని చాలా వరకూ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఉలవల్ని ఎడ్లకు, గుర్రాలకు ఆహారంగా ఇస్తారు. కాస్త డబ్బు తక్కువ ఉన్నవారు మాత్రమే ఉలవల్ని వాడతారనే మాట కూడా ఉంది. ఉలవల్ని గుగ్గిళ్ళు అంటారు.

Horse gram : ఉలవల్ని ఆహారంగా తీసుకుంటే రక్త వృద్ధితో పాటు... ఇంకా దీనితో.. !
Horse gram

మనం తీసుకునే చాలా ఆహారాలలో అనేక పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా ఉలవల విషయానికి వస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే వీటిని చాలా వరకూ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఉలవల్ని ఎడ్లకు, గుర్రాలకు ఆహారంగా ఇస్తారు. కాస్త డబ్బు తక్కువ ఉన్నవారు మాత్రమే ఉలవల్ని వాడతారనే మాట కూడా ఉంది. ఉలవల్ని గుగ్గిళ్ళు అంటారు. అయితే ఉలవలతో చేసే వంటకాలు మాత్రం చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఉలవల గుగ్గిళ్ళు, ఉలవచారు, చాలా ఫేమస్..

ఉలవల్లో పోషకాల విషయానికి వస్తే..

ఉలవల్లో 100గాములకు 321 కేలరీల శక్తి ఉంది. 22 గ్రాముల ప్రోటీన్లు, 57 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, ఉన్నాయి. పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉన్న ఉలవలు ఆరోగ్యానికి మంచి శక్తినిస్తాయి.

ఉలవపప్పు అనేక రకాల వంటలలో కనిపిస్తుంది, దాని ప్రత్యేక రుచి, విభిన్న ఆకృతి మళ్లీ మళ్ళీ తినేలా చేస్తుంది. నిజానికి, ఉలవలను తరచుగా సూప్‌లు, స్టైర్-ఫ్రైస్, కూరలు, పప్పులు వంటి వంటలలో ఉపయోగిస్తారు. చాలా వంటకాల్లో ఉలవలను ఉడకబెట్టడం లేదా వండడానికి ముందు వాటిని నానబెట్టడం లేదా మొలకెత్తడం వంటి ప్రోసెస్ ద్వారా తినేందుకు ఉపయోగిస్తారు. ఉలవల్ని కూడా కొన్నిసార్లు వేయించి, మసాలా దినుసులతో కలుపుకుని తినేందుకు ఉపయోగిస్తారు.

ఎండాకాలం చద్దన్నాన్ని తీసుకుంటే శరీరానికి ఎంత మేలో తెలుసా..!

1. అనారోగ్యంతో బాధపడే వారు ఉలవలు తీసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.

2. ఊపిరితిత్తుల్లో పేరుగున్న కఫాన్ని పలుచన చేస్తుంది.

3. కళ్లనుంచి నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.


ఈ తెరచాపలు కూలర్ కన్నా చల్లదనాన్ని ఇస్తాయి.. వేసవిలో వట్టివేరు ఉపయోగాలెన్నో... !!

4. ఆకలిని పెంచుతాయి.

5. ఉలవలు మూత్రంలో మంటను తగ్గిస్తాయి.

6. మూత్రశయంలో రాళ్లను కరిగిస్తాయి. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి.

7. ఉలవల్లో ఫైబర్, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్ అధికంగా ఉన్నాయి.

8. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఉలవలు చక్కగా పనిచేస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 04 , 2024 | 02:16 PM