Share News

Pregnancy : గర్భిణీ స్త్రీలు ఇలా ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోకూడదా..?

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:04 PM

ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న థాలేట్స్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ప్లాసెంటాను దాటి, పిండంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు కనుగొన్నారు.

Pregnancy : గర్భిణీ స్త్రీలు ఇలా ప్యాక్ చేసిన ఆహారాలు తీసుకోకూడదా..?
food packaging

ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన ఇటీవలి అధ్యయనం ప్రకారం, గర్భిణీలు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని తేలింది, ముఖ్యంగా ప్లాస్టిక్‌లతో సంబంధం ఉన్న రసాయనాలు అయిన థాలేట్‌లకు గురికావడం గురించి ఈ అధ్యయనం సాగింది. తినే ముందు ఆహారాన్ని తాకడం, చుట్టడం, ప్యాకేజింగ్, ఫుడ్ హ్యాండ్లర్లు ధరించే ప్లాస్టిక్ గ్లోవ్‌లు వంటివి కూడా ప్రమాదానికి కారణం కావచ్చని తేల్చింది.

ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న థాలేట్స్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ప్లాసెంటాను దాటి, పిండంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు కనుగొన్నారు. గర్భధారణ సమయంలో ఈ రసాయనాలకు గురికావడం వలన తక్కువ జనన బరువు, ముందస్తు జననం అలాగే పిల్లలలో మానసిక ఆరోగ్య రుగ్మతలు, ఆటిజం, ADHD వంటి వివిధ ప్రతికూల పరిస్థితులకు కారణం కావచ్చని తేలింది.

ఇది కూడా చదవండి: టోపు వల్ల కలిగే ఈ 5 ప్రయోజనాలు తెలుసా..!


పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ప్యాక్ చేసిన కేక్ మిక్స్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాంబర్గర్ బన్స్, శీతల పానీయాలు వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ థాలేట్ ఎక్స్‌పోజర్‌కు కారణం అవుతాయి. ఫుడ్ ఫ్యాక్ చేసేవారు ధరించే చేతి తొడుగులు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చని తేలింది.

ఫుడ్ ప్యాకింగ్ కారణంగా వచ్చే థాలేట్ ఎక్స్పోజర్‌కు తల్లులు ఈ హానికరమైన రసాయనాల బారిన పడే అవకాశం ఉంది. ఈ ఫలితాల వెలుగులో, థాలేట్ కలుషితాన్ని నివారించడానికి ఆహార ప్యాకేజింగ్,అలాగే. గర్భిణీ స్త్రీలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని ఈ పరిశోధన తేల్చింది. అలాగే దీనికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ మాంసాలను ఎంచుకోవాలని సూచించారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 10 , 2024 | 04:04 PM