Share News

Uric Acid Levels : శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగాయంటే పరిస్థితి ఏంటి..!

ABN , Publish Date - May 16 , 2024 | 11:09 AM

అధిక బరువు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కండర కణాలతో పోలిస్తే కొవ్వు కణాలు ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి.

Uric Acid Levels : శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగాయంటే పరిస్థితి ఏంటి..!
Uric Acid Levels

శరీరంలో ఏ వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా సరైన పోషకాలు కావాలి. ఏది సరిగా పనిచేయకపోయినా ఆ వ్యవస్థ దెబ్బతింటుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం జన్యశాస్త్రం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్ కు కారణమవుతాయి. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. శరీరం మూత్రపిండాలు, మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తుంది. ప్యూరిన్ ను ఎక్కువగా తీసుకుంటే లేదా శరీరం ఉప ఉత్పత్తిని తొలగించకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకుపోతుంది.

యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్‌లను కలిగి ఉన్న ఆహార పదార్థాల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే సహజ వ్యర్థ ఉత్పత్తి. ఈ యాసిడ్‌ని నియంత్రించడం వల్ల శరీరానికి చాలా అవసరం. అయితే అధికంగా పెరగడం కిడ్నీ స్టోన్స్ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం.

యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ రిచ్ ఫుడ్ జీర్ణక్రియ ఉప ఉత్పత్తి, ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో సహజంగా సంభవించే పదార్థాలు, శరీరంలో ఏర్పడతాయి. విచ్చిన్నమవుతాయి. శరీరం మూత్రపిండాల ద్వా యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్ర విసర్జిస్తుంది. పురుషులు 3.4 నుండి 7 మిల్లీ గ్రాములు డెసిలీటర్ స్త్రీలు 6మిమీ వరకూ ఉంటుంది. అయినప్పటికీ ఇది 3.5 నుంచి 7.2 మధ్య ఉంటుంది. చాలా రకాల పండ్లలో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. ఉచితంగా తీసుకోవచ్చు. కూరగాయల్లో కూడా ఇది ఉంటుంది. దోసకాయలు, క్యారెట్లు, ఆఖు కూరలు వంటి వాటిలో ఎ్కకువగా ఇది ఉంటుంది. పాలు, పెరుగు, చీజ్ వంటి తక్కువ కొవ్వు పాల ఉత్తపత్తుల్లో కూడా ఇది మామూలుగా దొరుకుతుంది.


వేసవిలో పెదవులు పగలకుండా, పొడిబారకుండా ఉంచేందుకు చిట్కాలు.. !

ఏవి తిన కూడదు..

సోడా, పండ్ల రసాలతో సహా చక్కెర పానీయాలు శరీరంలో యూరిక్ స్థాయిలను పెంచడానికి సహకరిస్తాయి. ఈ పరిస్థితి కంట్రోల్లో ఉండాలంటే నీరు,హెర్బల్ టీలు, తాజా పండ్ రసాలతో హైడ్రేట్ చేసుకోవాలి.

బరువు తగ్గడంలో..

అధిక బరువు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కండర కణాలతో పోలిస్తే కొవ్వు కణాలు ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. అధిక బరువు ఉండటం వల్ల మూత్ర పిండాలు యూరిక్ యాసిడ్ సమర్థవంతంగా ఫిల్టర్ చేయడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రమంగా తగ్గుతాయి.

డైటరీ ఫైబర్ తీసుకోవడం..

అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వ్యక్తులకు డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ రక్తప్రవాహం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ ను గ్రహించి తొలగిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 16 , 2024 | 03:32 PM